/rtv/media/media_files/2025/09/19/bigg-boss-ott-3-vishal-pandey-undergoes-surgeries-after-accidentally-slicing-nerves-1-2025-09-19-20-15-20.jpg)
Bigg Boss OTT 3 Vishal Pandey undergoes surgeries after accidentally slicing nerves (1)
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ OTT సీజన్ 3 కంటెస్టెంట్ విశాల్ పాండేకు ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన నరాలకు గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు రెండు ఆపరేషన్లు జరిగాయని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనతో విశాల్ పాండే అభిమానులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ‘OG’ నుంచి పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్.. వింటే గూస్‌బంప్సే
Bigg Boss OTT 3 Vishal Pandey
విశాల్ పాండే గురువారం ఆసుపత్రి నుండి తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ మేరకు తన ప్రమాదం గురించి స్వయంగా వెల్లడించారు. ‘‘నేను చాలా ఇష్టంగా, ప్రేమగా చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం నన్ను తీవ్రంగా కలచివేసింది. షూటింగ్ సమయంలో నేను అనుకోకుండా గాజుతో నా నరాలను కత్తిరించుకున్నాను. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఘటన తర్వాత రెండు ఆపరేషన్లు జరిగాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాను.
Also Read : నాన్‌స్టాప్ కిస్సింగ్స్.. K-RAMP టీజర్‌లో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయం చాలా తీవ్రమైనదని, కొన్ని అంగుళాల దూరంలో ఉన్న ధమని (Artery)కి ఎలాంటి హాని జరగకపోవడం విశాల్ అదృష్టమని చెప్పారు. ఒకవేళ అది కూడా దెబ్బతిని ఉంటే, ఆయన శరీరంలో సగం భాగం పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉండేదని వైద్యులు వెల్లడించారు. ఈ భయంకరమైన విషయం తనను ఇప్పటికీ వణికిస్తుందని విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే తన కుటుంబం, స్నేహితులు, అభిమానుల ఆశీస్సులు తనకు అండగా ఉన్నాయని, అందుకే తాను ఇంతటి ప్రమాదం నుండి బయటపడ్డానని విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ప్రమాదం తనకు ఒక చిన్న అడ్డంకి మాత్రమేనని, ఇది తనను మరింత దృఢంగా మారుస్తుందని విశాల్ ధీమా వ్యక్తం చేశారు. తాను త్వరలోనే పూర్తిగా కోలుకుని, తిరిగి పనిలోకి వస్తానని చెప్పారు. ఆసుపత్రిలో ఉండి కూడా తాను నవ్వుతూ ఉన్న ఫోటోలను పంచుకున్న విశాల్.. తన సంకల్పం దృఢంగా ఉందని చాటిచెప్పారు. ఆయన ఈ క్లిష్ట సమయంలో కూడా సానుకూలంగా ఉండడాన్ని చూసి అభిమానులు, శ్రేయోభిలాషులు అతడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఈ సంఘటన వినోద రంగంలో ఉన్న రిస్కులను మరోసారి గుర్తుచేసింది. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.