/rtv/media/media_files/2025/07/31/kingdom-twitter-review-2025-07-31-10-37-17.jpg)
Kingdom Twitter Review
‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సరైన హిట్టు కోసం ఎంతగానో ప్రయత్నిస్తు్న్నాడు. కానీ ఏ సినిమా కూడా విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పడం లేదు. అయినా విజయ్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. అదే ‘కింగ్డమ్’.
Also Read : బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు
Kingdom Twitter Review
ఈ సినిమా మొదటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అందరిలోనూ మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీమియర్స్‌ను యూఎస్‌లో ప్రదర్శించారు. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు వారి రివ్యూలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా తన రివ్యూ ఇచ్చాడు. ‘‘కింగ్‌డమ్ అనేది విజయ్ దేవరకొండ అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన నటనతో కూడిన ఒక ఘనమైన యాక్షన్ డ్రామా’’ అని తెలిపాడు.
#Kingdom is a solid action drama with stunning visuals and powerful performance by Vijay Deverakonda 🥶🔥#AnirudhRavichander 🥵💥🙏🏻#VijayDevarakonda#KingdomReview#KingdomMANAMKODTHUNAM#KingdomBlockBusterpic.twitter.com/NiEkQpU3f1
— SHiBiN SeBaSTiaN (@SHiBiNLeO7) July 31, 2025
మరొకరు.. ‘‘కింగ్డమ్ మూవీ బ్లాక్ బస్టర్‌గా ఉంది. ముఖ్యంగా స్టోరీ థీమ్ హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రో, సెకండ్ హాఫ్ మొత్తం డ్రామా నడిచింది. ఇందులో కొన్ని సీన్లలో విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే యాక్షన్, మ్యూజిక్ అద్భుతం. అయితే కొన్ని నిమిషాలు స్లోగా నడిచే సన్నివేశాలు ఉన్నాయి.’’ అని తెలిపాడు.
Also Read : బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఇప్పుడెలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే మతిపోతుంది
#kingdomReview: Movie is a blockbuster,
— MJ Cartel (@Mjcartels) July 31, 2025
- Story theme highlight of the Film
- 1st Half Characters intro
- 2nd Half deep drama
- Performance in some scenes Career best for #VijayDeverakonda
- Action & Music 🔥
- Slow Narration is light minus#Kingdom#Anirudh#SatyaDevpic.twitter.com/2OaHj1M6e9
‘‘విజయ్ దేవరకొండ జైల్ పెర్ఫార్మెన్స్ అండ్ అనిరుధ్ బీజీఎం నెక్ట్స్ లెవెల్. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు’’ అని మరొకరు రాసుకొచ్చారు.
Vijay devarakonda Jail Perfomance 🥵💥💥 Anirudh BGM Next Level 🔥🔥
— 𝙅 𝘼 𝙂 𝙂 𝙐 🔥 (@Jaggu_Tweetz) July 31, 2025
Blockbuster First Half 💥 Best Comeback Ever for an actor In Tollywood 🥵🥵💥💥 #KingdomBlockBuster#Kingdom#KingdomMANAMKODTHUNAM#KingdomReviewpic.twitter.com/1WWh8i2L47
ఇంకొకరు.. ‘‘హిట్టు కొట్టేసావ్ అన్నా.. సినిమా చాలా బాగుంది. ఆ బక్కోడు అయితే బీజీఎం ఇరక్కొట్టేశాడు.’’ అని తెలిపాడు.
Hittuuuuuu kottesav anna,🥺❤️💯
— nenu papini (@nenupapinii) July 31, 2025
Chala bagundi movie
Ni down ni chala Mandi🥴 korukunnaru but
You proved them wrong❤️🔥
Aaaaa bakkodu ayithe bgm irrakottesadu🥵📽️📽️📽️
Finally form pochi ichav bhai #VijayDeverakoda#KingdomMANAMKODTHUNAM#KingdomReview#kingdompic.twitter.com/wHLPriVSlU
‘‘విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశాడు’’ అని ట్వీట్ చేశాడు.
After a long time, you delivered a blockbuster, @TheDeverakonda anna..!
— SAI CHOWDARY (@imSaichowdary_) July 31, 2025
Welcome back to the Blockbuster Kingdom..! 🍿🔥#KingdomReview#Kingdompic.twitter.com/TNuLIiUPtZ
మొత్తంగా విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమాకు ట్విట్టర్‌లో మంచి టాక్ వస్తోంది. యాక్షన్, ఎమోషన్స్ బాగున్నాయని, విజయ్ నటన ఆకట్టుకుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా అనిరుధ్ BGM సినిమాకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Vijay Deverakonda Kingdom | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | 2025 Tollywood movies