/rtv/media/media_files/2025/07/31/tamil-actor-srinivasan-arrested-fraud-case-2025-07-31-11-15-11.jpg)
tamil actor srinivasan arrested fraud case
కోలీవుడ్ నటుడు ఎస్. శ్రీనివాసన్.. ఈ పేరు తమిళంలో బాగా ఫేమస్. సహాయక పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. దీంతో అతడికి ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో నటుడు శ్రీనివాసన్ తనకు తానే ‘పవర్‌స్టార్’ అని ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి అభిమానులు ఆయన్ను పవర్ స్టార్ అని పిలవడం మొదలెట్టారు.
Also Read : ‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ
Tamil Actor Srinivasan Arrested
ఆయన కమెడియన్‌గానే కాకుండా తన స్వంత నిర్మాణాలలో హీరోగా కూడా నటించి గుర్తింపు పొందారు. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు నిన్న (బుధవారం) ఆయన్ను అరెస్టు చేశారు. రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పి.. ఓ సంస్థ నుంచి సుమారు రూ.5 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు శ్రీనివాసన్ 2010లో ఒక సంస్థకు రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. అలా ఆ సంస్థ నుంచి సుమారు రూ.5 కోట్లు తీసుకున్నాడు. ఒకవేళ రుణం ఇప్పించలేకపోతే తీసుకున్న డబ్బును తిరిగి 30 రోజుల్లోగా ఇస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం ఆ సంస్థ నుంచి తీసుకున్న డబ్బును తన సినిమా నిర్మాణాలకు, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు.
Watch #TheBreakfastShow with @ParmeshwarBawa | Tamil Actor S Srinivasan Arrested In High-Value Loan Fraud Case pic.twitter.com/pr1SSfEeFm
— NDTV (@ndtv) July 31, 2025
ఇక ఆయన చెప్పిన 30 రోజులు గడిచినా రుణం రాకపోయేసరికి ఆ సంస్థ యాజమాన్యం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నటుడు శ్రీనివాసన్‌ను ఢిల్లీ పోలీసులు ఇటీవల చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అరెస్టు చేశారు. అనంతరం జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.
Also Read : సమంత నుంచి సాయి పల్లవి.. బాలీవుడ్‌ను ఏలేస్తున్న సౌత్ భామలు వీళ్ళే !
ఇలా శ్రీనివాసన్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, హాస్యనటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, వ్యాపారవేత్తగా కూడా పలు పనులలో ఉన్నారు. కాగా అతనిపై చెన్నైలో ఇదే తరహాకు చెందిన మరో ఆరు కేసులు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా నటుడు శ్రీనివాసన్ ఇలాంటి ఒక కేసులో 2013లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రూ.10 కోట్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కానీ రూ.3.5 లక్షలు మాత్రమే ఇచ్చి పరారయ్యారు.
kollywood | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news