Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్

టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని- సన్నీ డియోల్ కాంబోలో ఇటీవలే విడుదలైన 'జాట్' మూవీ వివాదంలో చిక్కుకుంది. చర్చిలో చిత్రీకరించిన రక్తపాత సన్నివేశాలపై ఆయా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update

 Sunny Deol:  బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన  'జాట్ ' మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో చర్చిలో చిత్రీకరించిన సన్నివేశం వివాదాస్పదంగా మారింది. ఇందులో విలన్ రణదీప్ హుడా చర్చి లోపల రక్తపాతం  సృష్టించడం పై   క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో  దీనిపై  చర్యలు తీసుకోకపోతే తమ నిరసనను ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. సినిమాను నిషేధించాలని సంఘం జాయింట్ పోలీస్ కమిషనర్‌కు డిమాండ్ లెటర్ ఇచ్చారు క్రైస్తవ సంఘ నేతలు. 

తపరమైన మనోభావాలకు భంగం 

ఈ సన్నివేశంలో చర్చి లోపల గూండాయిజం,  బెదిరింపు దృశ్యాలు చూపించబడ్డాయి.  ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ చర్య మొత్తం క్రైస్తవ సమాజం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని  సంఘ నేతలు మండిపడుతున్నారు. అతి పవిత్రమైన చర్చి వేదిక అపవిత్రం చేయబడిందని ఆగ్రహిస్తున్నారు.  రణదీప్ హుడా, దర్శకుడు, నిర్మాత , హీరో బ్యానర్‌తో సహా చిత్రంలోని స్టార్ తారాగణంపై  దైవదూషణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది క్రైస్తవ సమాజం. ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేసింది

బాలయ్య  'వీరసింహారెడ్డి'  ఫేమ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్  'జాట్'. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏప్రిల్ 10న విడుదలైన  'జాట్' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. 

 telugu-news 

Also Read: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు