/rtv/media/media_files/2025/06/09/UM9BKLGfXTO8vtNToRb8.jpg)
thug life
దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసన్ కాంబోలో 'థగ్ లైఫ్' సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలో ఈ మూవీ విడుదలకు ఆటంకం ఏర్పడింది. అయితే ఈ మూవీ స్క్రీనింగ్‌కు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
బ్యాన్ విధించగా..
కన్నడలో ఈ చిత్రంపై బ్యాన్ విధించగా.. దీనిపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం విచారించింది. తరచూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు ఆందోళనలు చేయడంతో కళాసృష్టి నిలిచిపోతోంది. ఇకపై వీటిని ఇక ఏమాత్రం కూడా కొనసాగించం. కేవలం ఒక అభిప్రాయం వల్ల సినిమాను ఆపేయాలా? స్టాండప్ కామెడీని నిలిపివేయాలా? అని న్యాయస్థానం బెంచ్ ప్రశ్నించింది.
ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!
సినిమా స్క్రీనింగ్‌కు అనుమతులు మంజూరు చేయాలని బెంగళూరుకు చెందిన ఎం.మహేష్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జూన్ 17వ తేదీన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దీంతో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. సీబీఎఫ్‌సీ నుంచి అనుమతి వచ్చిన ఈ మూవీ ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకోకుండా చూడాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
అలాగే సినిమాకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రాన్ని బుధవారం కోర్టులో దాఖలు చేయగా నేడు పిల్‌ను ముగించింది. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?