Kantara Chapter 1: రాజ‌సం ఉట్టి ప‌డేలా .. క‌న‌క‌వ‌తిగా రుక్మిణీ వ‌సంత్

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణీ వ‌సంత్ లుక్ ను రివీల్ చేశారు.  క‌న‌క‌వ‌తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజ‌సం ఉట్టి ప‌డేలా రుక్మిణీ లుక్ అదిరిపోయింది.

New Update
rukmini

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి(Rishab Shetty) ప్రధానపాత్రలో  తెరకెక్కుతోన్న చిత్రం కాంతార ఛాప్టర్‌-1(Kantara Chapter-1). కాంతార ఫస్ట్ పార్ట్ కు ప్రీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్  సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2025 అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్  ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణీ వ‌సంత్ లుక్ ను రివీల్ చేశారు.  క‌న‌క‌వ‌తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజ‌సం ఉట్టి ప‌డేలా రుక్మిణీ లుక్ అదిరిపోయింది.  'కాంతార' చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. దీంతో  దాని ప్రీక్వెల్ అయిన 'కాంతార: ఎ చాప్టర్ 1'పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

Also Read :  అయ్యో.. అల్లు అర్హ మంచు లక్ష్మిని అలా అనేసిందేంటి! ఫుల్ నవ్వేసిన అల్లు అర్జున్!

సప్త సాగరాలు దాటి సినిమాతో

సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రుక్మిణి వసంత్(Rukmini Vasanth), ఇప్పుడు వరుస సినిమాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా  నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ 64వ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. 96, మెయ్యళగన్ వంటి చిత్రాల ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Also Read :  Huma Qureshi : ఢిల్లీలో దారుణం..  నటి హుమా ఖురేషి సోదరుడు హత్య!

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న 'మదరాసి' సినిమాలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది. 

Advertisment
తాజా కథనాలు