Allu Arha Viral Video: అయ్యో.. అల్లు అర్హ మంచు లక్ష్మిని అలా అనేసిందేంటి! ఫుల్ నవ్వేసిన అల్లు అర్జున్!

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చిన్నప్పటి నుంచే సెలెబ్రెటీగా మారిపోయింది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.

New Update
allu arha video

allu arha video

Allu Arha: అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చిన్నప్పటి నుంచే సెలెబ్రెటీగా మారిపోయింది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మీ  అర్హకి సంబంధించిన ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది. ఇందులో అర్హ.. మంచు లక్ష్మీని అడిగిన ఓ ఫన్నీ ప్రశ్న అందరి దృష్టిని  నెట్టింట ఆకర్షించింది. అర్హ అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్, మంచు లక్ష్మి తెగ నవ్వుకున్నారు. అయితే అర్హ మంచు లక్ష్మిని.. ''మీరు తెలుగు వారేనా అని అడుగుతుంది''.. దానికి మంచు లక్ష్మి నవ్వేసి.. నన్ను ఆ ప్రశ్న ఎందుకు అడగాలనిపించింది అంటుంది! అప్పుడు బన్నీ కూడా గట్టిగా నవ్వేసి అవును ఎందుకు అడిగావు అంటూ కూతురిని అడుగుతారు. దీంతో అర్హ.. మీ యాస చూస్తే అలా అడగలనిపించింది అని బదులిస్తుంది. అర్హ ముద్దు ముద్దు మాటలు నవ్వులు పూయించాయి. ఇది చూసిన వారంతా సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహా రెడ్డిల ముద్దుల కుమార్తె అల్లు అర్హ. అర్హ కూడా బన్నీ మాదిరిగానే ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ తండ్రికి తగ్గ తనయ అన్నట్లుగా ఉంటుంది. అల్లు అర్జున్ తరచు తన కూతురికి సంబంధించిన ముద్దు ముద్దు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అర్హకు అయాన్ అనే అన్నయ్య ఉన్నాడు. అయాన్ కి సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇటీవలే ఐపీఎల్ ఫైనల్స్ లో అర్సిబీ విజయం సాధించగా.. అయాన్ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను బన్నీ షేర్ చేయగా నెట్టింట ఫుల్ వైరల్ అయ్యింది. ఇలా బన్నీ పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి సెలబ్రటీలుగా మారిపోయారు. 

ఇది ఇలా ఉంటే అర్హ 5 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన "శాకుంతలం" సినిమాతో అర్హ బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో భరతుడి పాత్రలో అర్హ అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన ముద్దు ముద్దు మాటలు భలే క్యూట్ గా అనిపించాయి. చిన్న వయసులోనే అర్హ మంచి నటనను ప్రదర్శించింది ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆమె తెలుగులో అనర్గళంగా డైలాగులు చెప్పడం ప్రేక్షకులను మెప్పించింది. అర్హకు తెలుగు పద్యాలు, తెలుగు భాష చక్కగా వచ్చు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే అర్హకి మాతృభాష పట్టు ఉండేలా ఆమెను పెంచినట్లు పలు ఇంటర్వూస్ లో చెప్పారు. అన్ స్తాపబుల్ షాలో బాలయ్య ముందు అర్హ పాడిన పాట నెట్టింట తెగ వైరల్ అయ్యింది. 

 "శాకుంతలం" తర్వాత, తదుపరి కొన్ని ఊహాగానాలు వచ్చాయి. పలు వార్త నివేదికల ప్రకారం.. ఆమె త్వరలో ఒక పెద్ద హీరో సినిమాలో నటించనుందని సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు