/rtv/media/media_files/2025/05/08/dWJShh6unFYa6qgbY7P7.jpg)
Kantara Chapter 1
2022లో విడుదలైన ‘కాంతార’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ టైటిల్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. హీరోగా, దర్శకునిగా రిషబ్ శెట్టి మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు.
ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
20 కిలోమీటర్ల దూరంలో
ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమా కుందాపుర నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రత్యేక ప్రదేశంలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా అదిరే అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘కాంతార: చాప్టర్ 1’ను భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
500 మందికి పైగా
ఇందులో భాగంగానే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్‌కి సంబంధించి పెద్ద పెద్ద నిపుణుల బృందంతో ఈ సినిమాలో కళ్లు చెదిరే యుద్ద సన్నివేశాలను రూపొందించినట్లు తెలిసింది. దీని కోసం దాదాపు 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులు, 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటివరకు తీసిన అతిపెద్ద యాక్షన్ సన్నివేశాలలో ఒకటిగా ఉంటుందని మేకర్స్ భావిస్తు్ననారు.
ఇది కూడా చూడండి: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!
ఈ అద్భుతమైన యుద్ద సన్నివేశాల్ని చిత్రీకరించడానికి కర్ణాటక కొండలలో దాదాపు 45-50 రోజుల షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఇక ఈ సన్నివేశాల కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, కలరిపయట్టులో 3 నెలల శిక్షణ తీసుకున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది.
ఇది కూడా చూడండి: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
rishab-setty | kanthara | kantara-chapter-1 | latest-telugu-news | telugu-news