/rtv/media/media_files/2025/04/14/bik20NIxotl3xlnRj7G8.jpg)
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్(JioHotstar) ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినీ ప్రియులకు బంపర్ ఆఫర్(independence-day-offer) ప్రకటించింది. ఈరోజు జియో హాట్ స్టార్ లోని కంటెంట్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రీమియం చెల్లించకుండానే కొత్త సినిమాలు, సీరీస్ లను ఎంజాయ్ చేయవచ్చు. "ఆపరేషన్ తిరంగా" పేరుతో ఈ ఆఫర్ ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం స్వాతంత్ర్య దినోత్సవం ఒక్కరోజుకి మాత్రమే పరిమితం.
Also Read : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. నెట్టింట ఫొటోలు వైరల్!
లాగిన్ అయితే చాలు
ఈ ఒక్క రోజులో మీరు ప్రీమియం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, ఇతర అన్ని కంటెంట్‌లను ఉచితంగా చూడవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ జియో హాట్ స్టార్ యాప్ లోకి లాగిన్ అయితే సరిపోతుంది. ఇది కేవలం జియో నెట్వర్క్ యూజర్లకు మాత్రమే కాదు.. జియో హాట్ స్టార్ యాప్ కలిగిన ఇతర యూజర్లు కూడా ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు. భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం(79th Independence Day) సందర్భంగా దేశభక్తిని చాటిచెప్పేలా "తిరంగ ఏక్, కహానియా అపెక్" అనే పేరుతో ప్రత్యేకంగా కొన్ని కంటెంట్‌లను అందించేందుకు ఈ ఆఫర్ ప్రకటించారు.
JioHotstar is bringing the nation together on Independence Day with Operation Tiranga. On August 15 everyone can enjoy the platform free and ad free all day. A perfect way to celebrate freedom with entertainment 🇮🇳#OperationTirangaOnJioHotstar#15thAugustFreeStreaming#FreeOn15pic.twitter.com/T2RgqQq6fv
— Gems Of Replies (@GemsOfReplies) August 14, 2025
ఈరోజు తర్వాత కూడా మీరు జియో హాట్ స్టార్ సేవలను కొనసాగించాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ చూసి తెలుసుకోండి.
- రూ. 349 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 90 రోజుల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.
- రూ. 949 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.
- రూ. 3,699 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2.5GB డేటా, ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌చూడలేకపోయి నా
ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో సలార్కార్, సర్జమీన్ పర్ వంటి కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పలు హాలీవుడ్ సినిమాలు, సీరీస్ లు అందుబాటులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఓటీటీలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ కి డోకా లేకుండా ఉంది. థియేటర్లో చూడలేకపోయినా చిత్రాలను హాయిగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు. సినిమలతో పాటు సీరీస్ లు టీవీ షోలు కూడా చూడవచ్చు.
Also Read:Coolie Review: 'కూలీ' ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ భయ్యా.. సినిమా ఎలా ఉందంటే!