/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-one-2025-08-15-15-19-35.jpg)
2024 అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట 2025 ఆగస్టు 14న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-two-2025-08-15-15-19-35.jpg)
ఇందుకు సంబంధించిన ఫొటోలను నటుడు విశ్వంత్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు, సెలబ్రెటీలు ఈ క్యూట్ కపుల్ కి విషెష్ తెలియజేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-three-2025-08-15-15-19-35.jpg)
ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-four-2025-08-15-15-19-35.jpg)
ఇదిలా ఉంటే నటుడు విశ్వంత్ దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'కేరింత' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నాడు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-five-2025-08-15-15-19-36.jpg)
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీలో కీలక పాత్రలో అలరించాడు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-six-2025-08-15-15-19-36.jpg)
నాని 'జెర్సీ' సినిమాలో కూడా విశ్వంత్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో నానితో పాటు ఒక క్రికెటర్ గా కనిపించాడు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-seven-2025-08-15-15-19-36.jpg)
తెలుగులో తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, మ్యాచ్ ఫిక్సింగ్, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, వంటి సినిమాల్లో నటించాడు.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-eight-2025-08-15-15-19-36.jpg)
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ నటించాడు విశ్వంత్. ఇటీవలే హైడ్ అండ్ సీక్ అనే క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. 'ఆహా' లో ప్రసారమైన ఈ సీరీస్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/08/15/viswant-duddumpudi-marriage-pic-nine-2025-08-15-15-19-36.jpg)
Image Credits: Viswant Duddumpudi/Instagram