Coolie Interval Twist: 'కూలీ' విడుదలను ఒక పండగల జరుపుకుంటున్నారు తలైవా ఫ్యాన్స్.అంచనాలకు తగ్గట్లే సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. తలైవా ఫ్యాన్స్ కి ఇదొక మాస్ ఫీస్ట్ అని అంటున్నారు నెటిజన్లు. సినిమాలో రజినీకాంత్ ఎంట్రీ సీన్ కి థియేటర్ మొత్తం అభిమానుల కేకలతో దద్దరిల్లింది. కాగితాలు ఎగురవేస్తూ, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. లోకేష్ స్క్రీన్ ప్లే, రజినీ స్వాగ్, నాగ్ విలనిజం ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్
మొత్తంగా మూడు ట్విస్టులు, ఆరు యాక్షన్ బ్లాక్స్ తో 'కూలీ' స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ తర్వాత.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది. ఈ ట్విస్ట్ సెకండ్ ఆఫ్ పై మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ ఇంటర్వెల్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఇక్కడే చెప్పేస్తే సినిమా చూసేటప్పుడు మీరు ఆ హైని కోల్పోతారు. ఇంటర్వెల్ తర్వాత రజినీ పాత్ర, ఆయన డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే 'కూలీ' ఫుల్ రివ్యూ ఇక్కడ చూడండి.
Believe Me this is not Chennai🥵
— Prabhas Devotee 🔥 (@sainathpb45) August 14, 2025
This is F#cking Hyderabad 😭🔥
Title Card ke Potaru ra😭🔥🔥🔥#CoolieThePowerHouse#Coolie#Rajinikanth 👑 #CoolieReviewpic.twitter.com/5GaYpfMH7D
కూలీ రివ్యూ..
సినిమా పేరు: కూలీ
నటీనటులు: రజినీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర
దర్శకుడు: లోకేష్ కనగరాజ్
కథాంశం..
గోల్డ్ స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని రూపొందించారు. సైమన్ (నాగార్జున) విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకొని గోల్డ్ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తుంటాడు. సైమన్ కి నమ్మకస్తుడిగా దయాళ్ (సౌబిన్ షాహిర్) పనిచేస్తాడు. ఇతడు సైమన్ వ్యాపారానికి అడ్డొచ్చిన వారందరినీ చంపేస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలో సైమన్ దగ్గర పనిచేస్తున్న హీరో (రజినీకాంత్) ఫ్రెండ్ రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోతాడు. ఆయనది సహజ మరణం కాదని గ్రహించిన రజినీ మిస్టరీని ఛేదించాడనికి రంగంలోకి దిగుతాడు. రాజశేఖర్ ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? రాజశేఖర్, రజినీ మధ్య స్నేహమేంటి? ఈ క్రమంలో రజినీ ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్? ఏంటి అనే అంశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
సినిమా పాజిటివ్స్
కూలీ సినిమాకు సూపర్ స్టార్ ప్రజెన్స్ అతి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఎప్పటిలాగే ఆయన స్టైల్, స్వాగ్, యాక్షన్ సీక్వెన్సులు, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో రజినీ లుక్ , స్క్రీన్ ప్రజెన్స్ అభిమానుల్లో మరింత జోష్ నింపింది. ఆ లుక్ లో సూపర్ స్టార్ ని చూడగానే మరోసారి రజినీ వింటేజ్ వైబ్స్ వచ్చాయి.
నాగార్జున విలనిజం
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో నెగిటివ్ షెడ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. సైమన్ పాత్రలో నాగార్జున్ చాలా స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా నటించి.. తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతుని అందించారు.
అనిరుధ్ బీజేఎం
ఇక అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా రజినీకాంత్ ఎంట్రీ, యాక్షన్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్.. అనిరుధ్ బీజీఎం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. 'కూలీ' పవర్ ఆంథం, మోనికా పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఫాన్స్ సీట్ల నుంచి లేచి డాన్సులు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్
లోకేష్ స్క్రీన్ ప్లే, యాక్షన్ మార్క్, యాక్షన్ సన్నివేశాలను, క్యారెక్టర్లను చూపించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా, ఆకర్షణీయంగా చూపించారు. అలాగే ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో కనిపించడం సినిమాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
శృతి హాసన్, రచిత రామ్, సౌబిన్
రజినీకాంత్ ఫ్రెండ్ సత్యరాజ్ కూతురిగా శృతి హాసన్ తన పాత్రలో ఆకట్టుకుంది. రజినీ, శ్రుతికి మధ్య జరిగే సన్నివేశాలు భావోద్వేగంగా నడుస్తాయి. ఇక నటి రచిత రామ్ కి మంచి రోల్ పడింది. ఊహించని ట్విస్టులతో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది.
సౌబిన్ సాహిర్ 'అవుట్ ఆఫ్ ది బాక్స్' అన్నట్లుగా తన పాత్రతో మెస్మరైజ్ చేశాడు. నెగెటివ్ షెడ్ తన విలనిజాన్ని పండిస్తూ అదరగొట్టాడు. ఇక అమీర్ ఖాన్, ఉపేంద్ర కాసేపే కనిపించినా తమ పాత్రలతో అలరించారు.
మైనస్ అంశాలు
కూలీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ రజినీ ఇంట్రో, నాగార్జున కథాంశంతో ఇంట్రెస్టింగ్ ముందుకెళ్ళగా.. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ చేసినట్లుగా అనిపిస్తాయని అంటున్నారు.
Also Read: 50 Years Of Rajinikanth: సినీ తారల నుంచి సీఎం వరకు.. సూపర్ స్టార్ కి సూపర్ విషెస్!