/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-2025-08-18-14-03-05.jpg)
Janhvi Kapoor
తాజాగా ముంబైలో జరిగిన కృష్ణాష్టమి(Sri Krishnastami) వేడుకలకు నటి జాన్వీ కపూర్, హీరో సిద్దార్థ్ మల్హోత్రా ముఖ్య అథితులుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో జాన్వీ కపూర్ ఉట్టి కొడుతూ 'భారత్ మాతా కీ జై'(Bharat Mata Ki Jai) అనే నినాదం పలకడం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురైంది. ఈ క్లిప్ వైరల్ కావడంతో ''స్వాతంత్య్ర దినోత్సవం, దహీ హండీ పండుగ ఒకేసారి జరుపుకుంటున్నట్లు ఉంది అంటూ జాన్వీ ట్రోల్ చేశారు కొందరు నెటిజన్లు. దీంతో తాజాగా జాన్వీ ఈ ట్రోలింగ్ పై స్పందించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-2025-08-18-14-21-12.png)
Also Read : అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్ అదిరింది.. కుర్రకారు ఫిదా!
ట్రోలర్స్ కి జాన్వీ కౌంటర్
జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ సందర్భానికి సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేస్తూ.. ముందుగా అక్కడ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న వ్యక్తి 'భారత్ మాతా కీ జై' అని నినాదం చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పాను. వారు చెప్పిన వీడియోను కట్ చేసి.. నా మాటలను మాత్రమే మీమ్ మెటీరియల్‌గా మార్చేశారు. ఒకవేళ నేను అప్పడు చెప్పకపోయినా అది ఒక సమస్య అవుతుంది అంటూ తన బాధను వ్యక్తం చేసింది జాన్వీ. అయినా దేశాన్ని పొగడడానికి ప్రత్యేకంగా ఒకరోజంటూ ఏమీ ఉండదు. జన్మాష్టమి రోజు మాత్రమే కాదు కాదు.. నేను ప్రతిరోజూ ‘భారత్ మాతాకీ జై’ అని చెబుతాను’’ అంటూ ట్రోలర్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
Jhanvi Kapoor said "someone said BHARAT MATA KI JAY" THEN SHE just repeated...
— Prafull Gangrade (@Prafull0407) August 18, 2025
If she not said slogan everyone claim her anti national and now she said that everyone make her memepic.twitter.com/8wlqnxk6OE
ఇదిలా ఉంటే జాన్వీ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పరమ్ సుందరి' ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. సిద్దార్థ్- జాన్వీ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈనెల 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ లో జాన్వీ డైలాగ్స్, ఆమె కాస్ట్యూమ్స్, ఆమె నటన బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని జాన్వీ కాస్ట్యూమ్స్ ని రిక్రియెట్ చేస్తూ సోషల్ రీల్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇందులో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో ఎంతో అందంగా కనిపించింది.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అడుగులు వేస్తోంది జాన్వీ! తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Manchu Manoj: కలిసిపోయిన మంచు విష్ణు, మనోజ్.. కొడుకుకి అవార్డు వేళ 'అన్నా' అంటూ పోస్ట్ !