/rtv/media/media_files/2025/03/13/jd0fuFJiGT3S9sXuDzDS.jpg)
అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సూర్యం, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలపింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్ ఇచ్చింది. మరో సీటును సీపీఐకి కేటాయించగా.. ఆ పార్టీ నెల్లికంటి సత్యంను బరిలోకి దించింది.
ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
— Congress for Telangana (@Congress4TS) March 13, 2025
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది.
🔸కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్
🔸సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. pic.twitter.com/YvKjK5XzTt
బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కు అవకాశం లభించింది. ఐదే ఐదు స్థానాలకు ఐదుగురు మాత్రమే బరిలో ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ముగియడంతో అధికారులు వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అసెంబ్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.