/rtv/media/media_files/2025/04/15/rWa9XbRO1n2YQ0EW8tLb.jpg)
HIT 3
హీరో నాని, శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. సినిమా హిట్ కొట్టడంతో భారీగా కలెక్షన్లను కూడా రాబట్టింది. తొలిరోజే రూ. 40 కోట్ల వసూళ్లతో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!
ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి అలరించింది. అలాగే రావు రమేశ్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
కేసులను ఛేధించడమే..
హిట్ 2 కి సీక్వెల్‌గా హిట్ 3 వచ్చింది. ఇందులో హీరో నాని అర్జున్ సర్కార్ పాత్రలో ఒక ఐపీఎస్ అధికారిగా నటించాడు. జమ్మూ కశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక క్రూరమైన హత్య కేసు వస్తుంది. దీన్ని చేధిస్తున్న సమయంలో దేశంలో ఇంకో 13 హత్యలు జరిగాయి.
వీటిని ఎలా చేధించాలని చూస్తుండగా.. దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్న సంగతి తెలుస్తుంది. దీన్ని గురించి తెలుసుకునే లోపు విశాఖకి అర్జున బదిలీ అవుతాడు. విశాఖ వెళ్లిన తర్వాత ఈ కేసును ఎలా ఛేధించారు? అసలు దారుణంగా హత్యలు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అనేది మూవీ స్టోరీ.
ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!
hit 3 | ott | latest-telugu-news