Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం నెలకొంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు.

New Update
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం నెలకొంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా అపోలో  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈ రోజు పరిస్థితి విషమించడంతో  మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచుతున్నారు. అనంతన్  5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్‌కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది.

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

1977 పార్లమెంటరీ ఎన్నికల్లో

అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. తమిళం అంటే మక్కువ ఉన్న కుమారి అనంతన్, తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రయాణం, రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అనంతన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

Also Read : Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు