HBD Megastar Chiranjeevi: తమ్ముడు పవన్ కి ప్రేమతో.. వైరలవుతున్న చిరంజీవి లేఖ!

ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే!  ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

New Update
HBD Megastar Chiranjeevi

HBD Megastar Chiranjeevi

ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే!  ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దీనికి మెగాస్టార్ స్పందిస్తూ.. తమ్ముడి పై ప్రేమతో ఒక నోట్ విడుదల చేశారు. ''తమ్ముడు కళ్యాణ్.. ప్రేమతో పంపిన బర్త్ డే విషెస్ అందాయి. నీ ప్రతీ మాట, ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్వపడుతున్నావో.. ఓ తమ్ముడికి నీ విజయాలను, నీ పోరాటాన్ని నేనూ అంతే ఆస్వాదిస్తున్నాను. నీ పట్టుదలే, కార్యదీక్షిత చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నాను.''

''నిన్ను నమ్మిన వాళ్లకు మంచి చేయాలనే తపన నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజున నీ వెనుక కోట్లాది మంది జనసైనికులు ఉన్నారు! ఆ సైన్యానికి ఒక రాజువై ముందుండి నడిపించు. వాళ్ళ కలలకు ఆశలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలి. అలాగే అన్నయ్యగా నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

Also Read :  'మన శంకరవరప్రసాద్ గారు'  వచ్చేశారు.. .. మెగాస్టార్ మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరింది!

HBD Megastar Chiranjeevi Tweet

Also Read :  మెగాస్టార్ ని ఆకాశానికెత్తిన అల్లు అర్జున్.. బర్త్ డే ట్వీట్ వైరల్!

ఇదిలా ఉంటే .. మెగాస్టార్ - పవర్ స్టార్ వీరిద్దరూ కేవలం హీరోలు మాత్రమే కాదు అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. పవన్ చిన్నతనం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఎదిగిన వరకు  చిరంజీవి(Chiranjeevi) ఆయనకు ఎల్లప్పుడూ అండగా, తోడుగా ముందుండి నడిపించారు. పవన్ కళ్యాణ్ ని ఒక తమ్ముడిగా కంటే ఒక బిడ్డలా భావిస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఇంటికి  వచ్చినప్పుడు.. తమ్ముడి విజయాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేశారు. పవన్ కూడా అన్న పట్ల ఎనలేని ప్రేమ, గౌరవాన్ని కలిగి ఉంటారు. చిన్నప్పటి అన్న చిరు కష్టాలను, విజయాలను చూస్తూ ఆయన స్ఫూర్తిగా ఎదిగారు పవన్.

చిరంజీవి మాత్రమే కాదు ఆయన భార్య సురేఖ కూడా పవన్ పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు. వదినమ్మ తనను చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచిందని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ డిప్యూటీ cm అయిన తర్వాత మరిది కోసం ఒక కాస్ట్ లీ పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు సురేఖ. ఆ పెన్ పవన్ సంతకాలు చేయడానికి ఉపయోగిస్తారట. అంతే కాదు అది ఎప్పుడూ పవన్ జేబులోనే ఉంటుందట. నాగబాబు ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత కూడా ఇలాంటి పెన్ నే గిఫ్ట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు