They Call Him OG: ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

New Update
director Sujith

director Sujith

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 'ఓజీ'(OG Movie) భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ తో దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పడిపోగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా స్టోరీనే అయినప్పటికీ.. అదిరిపోయే స్క్రీన్ ప్లే, బీజీఎం, కావాల్సినన్నీ హై మూమెంట్స్ తో పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్ సుజీత్. పవర్ స్టార్ ఫ్యాన్స్ మంచి కిక్కిచ్చే సినిమా తీసుకొచ్చాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. 

Also Read :  EMI కట్టలేదని స్టార్ హీరో ఇల్లు వేలానికి! ఇంటి ముందు బ్యాంక్ అధికారులు (వీడియో వైరల్)

సుజీత్ ఎమోషనల్ పోస్ట్ 

ఈ క్రమంలో డైరెక్టర్ సుజీత్(director sujeeth) సినిమా గురించి తన ఎక్స్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''“They Call Him OG మీ ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల ఈ ప్రయాణం చివరికి ముగిసింది. ఓవైపు ఉత్సహాం, మరోవైపు బాధగా కూడా ఉంది! ఈ ప్రయాణం ప్రతి అడుగులో నాకు తోడుగా, అండగా నిలిచినా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా డైరెక్షన్ అండ్ టెక్నీషియన్ బృందానికి 'ఐ లవ్ యూ'! ఇంతకంటే నేనింకా ఏమీ చెప్పలేను. ప్రతీ కష్టంలో నాకు తోడుగా , అండగా నిలబడ్డారు. అలాగే నన్ను నమ్మిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ దాసరి, సినిమా కోసం తన 100 % ఇచ్చిన తమన్ అన్నకు థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి బ్రో ఆడియన్స్ మీ మ్యాజిక్ తెరపై చూసే వరకు వేచి ఉండలేకపోతున్నాను! ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్ నెస్ ఊహించలేనిది! ఇది ఆరంభం మాత్రమే.. అన్నీ సరిగ్గా కుదిరితే  'ఓజీ' మరింత పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్'' అంటూ చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు సుజీత్.  

Also Read: OG Viral Video: ఇదేం క్రేజ్ రా బాబూ.. 'ఓజీ' థియేటర్లు విజిల్స్ వేస్తూ మెగా హీరోలు రచ్చ రచ్చ! 🔥🔥🔥🔥

#telugu-film-news #telugu-cinema-news #telugu-news #latest-telugu-news #director sujeeth #OG Movie #TheyCallHimOG #OG Review
Advertisment
తాజా కథనాలు