/rtv/media/media_files/2025/02/04/j8Q0LgiLbGoRAPUP4GP1.jpg)
Harihara Veeramallu 2nd Song
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ(Periodic Movie) హరిహర వీరమల్లు లిరికల్ సాంగ్స్(Hari Hara Veera Mallu Lyrical Songs) ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ పవన్ స్వయంగా పాడిన 'మాట వినాలి'(Maata Vinaali) అనే పాటను విడుదల చేశారు. ఈ పాట కొన్ని వారాల క్రితమే రిలీజ్ అయ్యింది, కానీ ఆడియన్స్ ఆ పాటను పెద్దగా ఆదరించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ పాట గురించి కొంచెం డిస్సపాయింట్ అయ్యారు అనే చెప్పాలి. పాట నెమ్మదిగా సాగుతుండటం, ఎక్స్ ప్రెషన్స్ సరిపోలేకపోవడం వంటి విమర్శలు వినిపించాయి. ఈ పాటతో ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుందని భావించిన యూనిట్ కు నిరాశే మిగిలింది.
ఇప్పుడు, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ఫిబ్రవరి 14న సెకండ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాట కూడా జానపద అంశాలు కలిగిన పాట అని తెలుస్తోంది. ఇందులో నిధి అగర్వాల్(Nidhhi Agerwal) పాత్రకు సంబంధించి కొన్ని అప్డేట్‌లు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ పాటలో ఆమె లుక్, పాత్ర గురించి కొంత రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
2nd సింగిల్‌తో మళ్లీ ఊపు..
ఈ సింగిల్‌తో కీరవాణి(Keeravani) ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. బాహుబలి పాటలు(Baahubali Songa) లాగానే ఈ మూవీ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయని ఆశతో పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొదటి పాట పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, రెండవ సింగిల్(Hari Hara Veera Mallu 2nd Song)తో మళ్లీ ఊపు రాబట్టాలని యూనిట్ ఆశిస్తోంది. ఈ సినిమాలో మొత్తం ఎన్నిపాటలు ఉంటాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది, ఫిబ్రవరిలో షూటింగ్ మొత్తం పూర్తయితే, మార్చి నెలలో సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
Also Read: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?
Also Read: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే