/rtv/media/media_files/2025/02/04/J1ghGLk5AA8GkGEcyaMe.jpg)
tax escape cars Photograph: (tax escape cars)
Cars Seized In Bengaluru: ఫెరారీ(Ferari), పోర్షే(Ford), MBW, ఆడి(Audi), ఆస్టన్ మార్టిన్(Aston Martin), రేంజ్ రోవర్(Range Rover) ఈ పేర్లు వీటేనే అదో రకమైన ఫీల్. ఎందుకంటే వాటికున్న రేంజ్ అది. కోట్లకు పడగలెత్తిన వాళ్లు మాత్రమే వాటిని మేయిన్‌టైన్ చేయగలరు. కోటిశ్వరుల కొడుకులు, కుటుంబ సభ్యులు దర్జా కోసం వీటిని కొంటారు. పోర్షే కారు బేసిక్ స్టార్టింగ్ వేరియంటే రూ.96 లక్షలు ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఇక బెంజ్, ఫెరారీ, MBW, ఆడి, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్ ల రేట్లు కూడా కోట్లల్లో ఉంటోంది. వాటిపై ఇండియాలో ట్యాక్సులు(Indian Tax) కూడా లక్షల్లో విధిస్తారు.
Also Read: Defection MLAs : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....
Karnataka RTO seized 30 luxury cars, including Ferrari, Porsche, BMW, Benz, and Audi, for evading tax on Sunday. Notices were issued to recover ₹3 crore in dues@tdkarnataka pic.twitter.com/ccvfWEDGbF
— ChristinMathewPhilip (@ChristinMP_) February 3, 2025
తాజాగా బెంగుళూర్ సిటీలో పన్ను కట్టకుండా రోడ్లపై తిరుగుతున్న సగ్జరీ కార్లను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 47 ప్రకారం.. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే, యజమాని కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ పొందాలి. రాష్ట్రంలో కట్టాల్సిన పన్నులు చెల్లించకుండా నడుస్తున్న కార్లపై బెంగళూరు రవాణా శాఖ సీరియస్ అయ్యింది.
Also Read: మణిపూర్ అల్లర్ల వెనుక సీఎం బైరెన్ సింగ్ !.. సుప్రీంకోర్టు ఆదేశం
30 లగ్జరీ కార్లు.. సీజ్
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సి మల్లికార్జున్ ఆదివారం బెంగుళూర్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో ట్యాక్స్ ఎగవేస్తున్న 30 లగ్జరీయస్ కార్లును స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్న ఫెరారీ, పోర్షే, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, ఆస్టన్ మార్టిన్ మరియు రేంజ్ రోవర్‌తో సహా 30 లగ్జరీ కార్లను బెంగళూరు రవాణా శాఖ స్వాధీనం చేసుకుంది. 41 మంది రవాణా శాఖ అధికారుల టీం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రూ.3 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు జారీ చేసింది.
Also Read: కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రేవంత్ సంచలన ప్రకటన