/rtv/media/media_files/2025/02/04/ycn3rn6ubTSc2guQU3r4.jpg)
sai pallavi- naga Chaitanya
Sai Pallavi: అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' ఈ నెల 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ''ఈరోజు హీరో చైతన్యను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీతో చై కోసం ఏవైనా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటే ఇక్కడ మెసేజ్ చేయండి అంటూ ఫ్యాన్స్ కి తెలిపింది. ఇక ఆలస్యం ఎందుకు.. మీరు కూడా చైతన్యను ఏమైనా అడగలనుకుంటే.. వెంటనే సాయి పల్లవి ట్విట్టర్ అకౌంట్ కి వెళ్లి.. అక్కడ మీ క్వెషన్ కామెంట్ చేయండి.
Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com
I’ll be interviewing @chay_akkineni today!
— Sai Pallavi (@Sai_Pallavi92) February 4, 2025
If you have interesting questions for him, pls drop them here! #Thandel #ThandelonFeb7th
మత్స్యకారుల కథా నేపథ్యంలో
శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశ్వరం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు రూ. 72 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన తొలి చిత్రమిది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో చై ఎప్పుడు కనిపించని విధంగా రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. అచ్చం సముద్రంలో వేటకు వెళ్లే ఒక మత్స్యకారుడిగా అతడి లుక్ కనిపిస్తోంది.
ఈ సినిమాకు దేవి పాటలు మరొక హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. 'లవ్ స్టోరీ' తరువాత చై- పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Life Style: పడుకునే ముందు వీటిలో ఒకటి తాగడం మర్చిపోవద్దు! ఎందుకంటే..