Mrunal Thakur: సినిమా రివ్యూల పై నిప్పులు చెరిగిన మృణాల్ ఠాకూర్! ఫ్యాన్ తో చిట్ చాట్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా సినిమా రివ్యూలపై విమర్శించింది. చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేవిగా ఉంటాయని.. అందుకే రివ్యూలు కాకుండా  సినిమా చూసి మీరే ఒక నిర్ణయానికి రావాలి ఫ్యాన్స్ తో చేసిన ఓ చిట్ చాట్ లో పేర్కొంది.

New Update

Mrunal Thakur: ఈ మధ్య ఇండస్ట్రీలో రివ్యూలా ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అలా సినిమా విడుదలవగానే ఇలా సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు యూట్యూబర్లు, ఇన్ ఫ్లుఎంసెర్స్! చెప్పాలంటే చాలా మంది ఆడియన్స్ ఈ రివ్యూలు చూసే సినిమాలకు వెళ్తున్నారు. ఈ రివ్యూలు సినిమా లైఫ్, థియేట్రికల్ రన్ పై ప్రభావం చూపుతుందని ఇప్పటికే హీరోలు, నిర్మాతలు మండిపడుతున్నారు. సినిమా చూసి రివ్యూ చెప్తే బాగుంటుంది, కానీ కొందరు చూడకుండానే సినిమాను జడ్జ్ చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా సినిమా రివ్యూలను  విమర్శించింది.

రివ్యూలపై మృణాల్ విమర్శలు

అయితే ఇటీవలే అజయ్ దేవగన్- మృణాల్ జంటగా నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' థియేటర్స్ లో విడుదలవగా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.   ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో ఒక అభిమానిని.. నెగిటివ్ రివ్యూలా కారణంగా నేను 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ చూడలేదని చెప్పాడు. దీనికి మృణాల్.. చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేవిగా ఉంటాయని.. అందుకే రివ్యూలు కాకుండా  సినిమా చూసి మీరే ఒక నిర్ణయానికి రావాలి ఆంటూ సినిమా రివ్యూలను  విమర్శించింది.

ఇదిలా ఉంటే 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ  బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆగస్టు 1న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.7.25 ఓపెనింగ్ సాధించింది. ఆ తర్వాత శని, ఆదివారాల్లో రూ.8.25 కోట్లు, రూ.9.25 కోట్లు వసూలు చేసింది. మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమా రూ.24.75 కోట్లు రాబట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ ఫిల్మ్ అయినప్పటికీ రోజువారీ వసూళ్ళలో ఒక్క రోజు కూడా డబుల్ డిజిట్స్ నమోదు చేయలేకపోయింది. 2012లో 'సన్ ఆఫ్ సర్దార్' సినిమా సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో రవి కిషన్,  నీరూ బజ్వా, దీపక్ డోబ్రియాల్, కుబ్రా సైత్, చంకీ పాండే, శరత్ సక్సేనా తదితరులు కీలక పాత్రలో పోషించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాను విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించారు. 

Also Read:Gurram Paapi Reddy Teaser: ఫరియా కామెడీకి నవ్వులే నవ్వులు.. 'గుర్రం పాపి రెడ్డి' టీజర్ చూశారా!

Advertisment
తాజా కథనాలు