/rtv/media/media_files/2025/02/16/gsQkBtGqrYYzKMHsw3Cv.jpg)
Kim Se Ron
కిమ్ సేన్ రాన్..అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా గుర్తింపు పొందారు. దక్షిణ కొరియాకు చెందిన ఈమె వయసు 24 ఏళ్ళు. ఇంత చిన్న వయసులోనే కిమ్ మృతి చెందారు. ఆమె మరణం వార్త విన్న అభిమానులు, ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ద్రిగ్భాంతికి గురవుతున్నారు. ఈరోజు కిమ్ మృతదేహం సియోల్ లోని సాంగ్‌డాంగ్-గులోని తన ఇంట్లో దొరికింది. ఒక వ్యక్తి ఈరోజు సాయంత్రం 4.50 గంటలకు ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిమ్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమికంగా ఆమె మృతికి ఎటువంట కారణాలు తెలియలేదు. ఇంట్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ, నేర కృత్యాలు జరిగినట్లు కనిపించలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు
కిమ్ రాన్ సేన్ చిన్న వయసులో నటి అయ్యారు. ఆమె ప్రధానంగా టీవీ షోల్లో కనిపించింది. ‘బ్లడ్‌హౌండ్స్’, ‘లివరేజ్’, ‘మిర్రర్ ఆఫ్ ది విచ్’, ‘టు బి కంటిన్యూడ్’, ‘హై స్కూల్ – లవ్ ఆన్’ వంటి ప్రముఖ డ్రమాల్లో నటించి ఎంతో పేరు సాధించింది. అందంగా లేతగా ఉంటే కిమ్ చాలా మందికి ఫేవరెట్.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!