Dharmendra: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే రొమాంటిక్ డ్రామాతో తన కెరీర్‌ను ప్రారంభించారు.

author-image
By Krishna
New Update
dharmendra

Dharmendra

Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే రొమాంటిక్ డ్రామాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ధర్మేంద్ర తన 19 ఏళ్ల వయసులోనే 1954లో ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు (విజేత, అజిత) ఉన్నారు.

ఇక నటి హేమమాలినితో ప్రేమలో పడ్డాక ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నించగా అందుకు ఆమె నిరాకరించారు. దీంతో, ధర్మేంద్ర ఇస్లాం మతంలోకి రహస్యంగా మారి, తన పేరును దిలావర్ ఖాన్ గా  మార్చుకుని 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇస్లాం చట్టం ప్రకారం ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం అంగీకారం కాబట్టి, ధర్మేంద్ర ఆ మార్గాన్ని ఎంచుకున్నారని టాక్. 

Also Read: బిగ్‌బాస్‌ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే

షోలే సినిమా షూటింగ్ టైమ్ లోనే ధర్మేంద్ర, హేమమాలిని ప్రేమించుకుంటున్నారు. సినిమాలోని తుపాకీ పట్టుకునే సీన్లలో, ధర్మేంద్ర ..  హేమమాలినిని కౌగిలించుకునే అవకాశం కోసం కావాలనే లైట్‌బాయ్‌లకు డబ్బులు ఇచ్చి కట్ చెప్పమని చెప్పేవారట. ఇలా ఒక హగ్‌ను పదే పదే షూట్ చేసేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఈ హగ్స్ కోసం ఆ రోజుల్లో రూ. 2000 వరకు ఖర్చు చేశారట ధర్మేంద్ర.  

Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’

1970లలో ధర్మేంద్ర, డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన నటి హేమమాలినితో కలిసి అనేక చిత్రాలలో నటించారు. 'షరాఫత్', 'తుమ్ హసీన్ మై జవాన్', 'సీతా ఔర్ గీత', 'షోలే' వంటి చిత్రాలు వీరిద్దరి రొమాన్స్‌ను వెండితెరపై పండించాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం క్రమంగా ప్రేమగా మారింది. హేమమాలినిని వివాహం చేసుకోవాలని ధర్మేంద్ర బలంగా కోరుకున్నారు. ధర్మేంద్ర తన భార్య ప్రకాష్ కౌర్ వద్దకు వెళ్లి హేమమాలినిని పెళ్లి చేసుకునేందుకు  విడాకులు కోరగా, ఆమె అంగీకరించలేదు.

Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

మత మార్పిడి ద్వారా హేమమాలినిని

కానీ ధర్మేంద్ర  మత మార్పిడి ద్వారా హేమమాలినిని తన రెండో భార్యగా స్వీకరించగలిగారని టాక్‌. ఈ వివాహం ధర్మేంద్ర మొదటి కుటుంబంలో ముఖ్యంగా ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. కొంతకాలం పాటు ధర్మేంద్ర మొదటి భార్య కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత, ఈ జంట మతమార్పిడి అంశంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో, తిరిగి హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆచారాలను పాటించడం ప్రారంభించినట్లు సమాచారం. ధర్మేంద్ర, హేమమాలిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు - ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు.

Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!

ప్రకాష్ కౌర్ బహిరంగంగా ధర్మేంద్రపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ధర్మేంద్ర మంచి తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. అయినప్పటికీ, ఒక భార్యగా నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేరని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

#telugu-news #bollywood #hema-malini #Dharmendra
Advertisment
తాజా కథనాలు