/rtv/media/media_files/2025/11/24/chikiri-chikiri-2025-11-24-16-51-59.jpg)
Chikiri Chikiri
Chikiri Chikiri: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కాకముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాట ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటూ రికార్డులు నమోదు చేస్తోంది.
Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’
ఈ పాట విడుదలైన 16 రోజులకే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల (10 కోట్ల) వ్యూస్‌ను దాటింది. దింతో రామ్‌చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో భారీగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది.
Also Read: బిగ్‌బాస్ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే
చికిరి పాటలోని హుక్ స్టెప్ ఇప్పుడు అన్ని ప్లాట్‌ఫారమ్‌ల్లో వైరల్ అవుతోంది. నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, 5 లక్షల మందికి పైగా సోషల్ మీడియాలో ఈ స్టెప్‌ను రీక్రియేట్ చేసి రీల్స్, షార్ట్ వీడియోలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫారమ్స్ అంతా ఈ స్టెప్‌తో ఉన్న వీడియోలే నిండిపోయాయి.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
హీరో నితిన్ చిన్న కుమారుడు ఈ పాటకు చేతులను కదుపుతూ చేసిన క్యూట్ వీడియో కూడా అందరిని ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలలో కూడా ఈ పాట మంచి క్రేజ్‌ని సంపాదించింది. “చికిరి చికిరి…” అంటూ సాగుతున్న ఈ ఫుల్ ఎనర్జీ సాంగ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించారు. మోహిత్ చౌహాన్ తన ప్రత్యేకమైన గళంతో పాటను మరింత రొమాంటిక్, మెలోడిగా మార్చాడు. బాలాజీ రాసిన పదాలు ఈ పాటకు కొత్త అందాన్ని తెచ్చాయి.
Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించనుండటం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తం మీదపెద్ది సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగే ఇంత పెద్ద సక్సెస్ సాధించడం విశేషం. చికిరి సాంగ్ ఇలా దూకుడుగా కొనసాగితే, విడుదల తర్వాత మరిన్ని రికార్డులు ఖాయమే అంటున్నారు సినీ వర్గాలు. పెద్ది సినిమాకు వచ్చిన ఈ పవర్ ఫుల్ ప్రారంభంతో ఇప్పుడు అభిమానులు సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us