/rtv/media/media_files/2024/12/09/tl8g2iFTq0ksOdfy9uFT.jpg)
ott movies
ప్రస్తుత డిజిటల్ యుగంలో వినోదానికి కొదువే లేదు. ఓటీటీ (OTT), థియేటర్, యూట్యూబ్ ఇలా రకరకాల మాధ్యమాలలో కావాల్సినంత ఫన్, ఎంటర్టైనమెంట్ అందుబాటులో ఉంది. ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ ను ఎంజయ్ చేయవచ్చు. ఇక ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ, థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటో ఇక్కడా చూద్దాం..
Also Read : ఇన్స్టాలోకి బ్రహ్మానందం ఎంట్రీ.. క్షణాల్లో లక్షల ఫాలోవర్లు!
ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు
తండేల్
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel) ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : ఆ విషయంలో శోభిత ఎక్కువగా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య
విడాముయార్చి
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ ఫిల్మ్ 'విడాముయార్చి'. తెలుగులో ఈ చిత్రం 'పట్టుదల' అనే పేరుతో విడుదల కాబోతుంది. అజర్‌బైజాన్ నేపథ్యంలో సాగిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో రెజీనా, హీరో అర్జున్ కూడా కీలక పాత్రలు పోషించారు.
ఒక పథకం ప్రకారం
యంగ్ హీరో సాయిరామ్ ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత విలన్ ఎవరో కనిపెడితే రూ. 10 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన 50 థియేటర్స్ లో మాత్రమే ఈ పోటీ నిర్వహించబడుతుంది.
అనుజ
ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్ 'అనుజా' (Anuja) ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 97వ ఆస్కార్ అవార్డులకు 'లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్' విభాగంలో అనుజా నామినేట్ అయ్యింది.
Also Read : ఏందీ బ్రో అంత మాట అంది.. ఆ పనికి మొగుడు అక్కర్లేదట!
- అమెజాన్ ప్రైమ్ వీడియో: ది మెహతా బాయ్స్ (ఫిబ్రవరి 7)
- డిస్నీ+ హాట్‌స్టార్: కోబలి (ఫిబ్రవరి 4)
నెట్‌ఫ్లిక్స్
- సెలబ్రిటీ బేర్ హంట్: ఫిబ్రవరి 5
- ప్రిజన్ సెల్ 211: ఫిబ్రవరి 5
- ది ఆర్ మర్డర్స్: ఫిబ్రవరి 6
జీ 5
- మిసెస్ (ఫిబ్రవరి 7)
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?