/rtv/media/media_files/2025/02/02/Y74Xx4rizOIxSL8jCUTO.jpg)
tina datta
చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ టీనా దత్తా. ఉత్తరన్ సీరియల్ తో బాగా పాపులర్ అయిన టీనా దత్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. 33 ఏళ్ల టీనాకు ఇంకా పెళ్లి కాలేదు.. ఒంటరిగానే ఉంటుంది. అయితే తాజాగా ఆమె తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనే కోరికను టీనా వ్యక్తం చేసింది.
సరోగసీ లేదా దత్తత కోసం టీనా దత్తా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నేను మంచి తల్లిని కాగలనని అనుకుంటున్నానని టీనా వెల్లడించింది. ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకున్న సుస్మితా సేన్ లాంటి మహిళలను తాను ఆరాధిస్తానని చెప్పింది. తాను సరోగసీ లేదా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే తన కుటుంబం అందుకు మద్దతు ఇస్తుందని వెల్లడించింది. నన్ను, నా కుటుంబాన్ని నేను చూసుకోగలిగితే, నేను ఒక బిడ్డను చూసుకోగలనని తెలిపింది. ఇందుకోసం భర్తపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
Tina Datta ❤️#TinaDatta pic.twitter.com/oOPM2hJeTX
— WV (@Weekendvibes_) February 2, 2025
భర్త సహాయం అవసరం లేదు
తన పిల్లల బాధ్యత తీసుకోవడానికి భర్త సహాయం అవసరం లేదని... ఈ బాధ్యతను నెరవేర్చడానికి నేను మాత్రమే సరిపోతుందని తెలిపింది. పిల్లలను దత్తత తీసుకున్న తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, అయితే వారు సెలబ్రిటీలు కానందున అది వార్త కాలేకపోయిందని టీనా వెల్లడించింది.
తాజాగా ప్రేమ, పెళ్లి, పిల్లలపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇదిలా ఉంటే టీనా దత్తా ఇటీవల ముంబై జిమ్ సంస్కృతి ఆధారంగా రూపొందించబడిన క్రైమ్- థ్రిల్లర్ సిరీస్ పర్సనల్ ట్రైనర్ అనే వెబ్ సీరిస్ లో కనిపించింది. ఇది 2024 జనవరి 23నుండి హంగామాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Best Camera Smartphones: ఆహా.. ఓహో అనిపించే బెస్ట్ కెమెరా ఫోన్లు.. కేవలం రూ.20 వేలలోపే!