/rtv/media/media_files/2025/01/16/25jBmQZAsOi3VDraIdip.jpg)
brahmanandam
Brahmanandam: ఆయన సోషల్ మీడియాలో లేనప్పటికీ.. మీమ్స్ రూపంలో ఎల్లప్పుడూ కనిపిస్తూ, వినిపిస్తుంటారు లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం. సోషల్ మీడియాలో ఆయన లేని మీమ్ కంటెంట్ ఊహించుకోలేము. ఒక ఎమోజీలా మారిపోయారు. మీమ్స్ లో ఆయన మొహం, ఎక్సప్రెషన్స్ కనిపిస్తే చాలు కడుపుబ్బా నవ్వేస్తారు. బ్రహ్మానందం ఎమోజీలతో రోజూ సోషల్ మీడియాలో వేలలో మీమ్స్ కనిపిస్తుంటాయి. అందుకే ఆయనను గాడ్ ఆఫ్ మీమ్స్. అలాంటి బ్రహ్మానందం ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. నెల రోజుల క్రితం ఆయన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు. బ్రహ్మానందం అకౌంట్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నెలరోజుల్లోనే ఆయనను లక్షకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.
Also Read: Anasuya: అంతా నా ఇష్టం.. బికినీలో కాదు.. మొత్తం విప్పి తిరుగుతా మీకెందుకూ? : అనసూయ
గిన్నీస్ వరల్డ్ రికార్డు..
సౌత్ సినిమాల్లో ఇప్పటివరకు ఎంతో మంది హాస్య నటులు వచ్చారు, వెళ్లారు.. కానీ బ్రహ్మానందం మాత్రం చిరకాలం గుర్తుండిపోయే హాస్యాన్ని అందించారు. తెలుగు సినిమాలో చరిత్రలో ఆయన కామెడీ లేని సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. సినిమాలో ఆయన ఉన్నారంటే ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులే. దాదాపు 1250 సినిమాలకు పైగా చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమాతో సంబంధం లేకుండా తన పాత్రతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోగల మహా నటుడు బ్రహ్మానందం. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఆయనది. 35 ఏళ్ళ కెరీర్‌లోనే 6 నంది అవార్డులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్,మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఫోర్త్ హయ్యస్ట్ సివిలియం అవార్డు పద్మ శ్రీ కూడా ఆయనను వరించింది. బ్రహ్మానందం 1987లో సినిమాల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!