Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 11 సీజన్ల నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయనని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

New Update
hero Sudeep

Bigg Boss host Kiccha Sudeep

Kiccha Sudeep:  బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss). వివిధ భాషల్లో ప్రసారం అయ్యే ఈ షోకు .. ఆయా చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా కన్నడ బిగ్ బాస్ హోస్ట్(Kannada Bigg Boss Host) హీరో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 11 సీజన్లు గా హోస్ట్ చేస్తున్న ఆయన షోకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను బిగ్ బాస్ హోస్ట్ చేయనని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

Also Read: Ajanta Ellora International Film Festival: 'శాంతి నికేతన్' చిత్రానికి గోల్డెన్ కైలాస్ అవార్డు!

Also Read:  Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!

సుదీప్ పోస్ట్.. 

దాదాపు 11 సీజన్ల నుంచి నేను ఈ షోను ఎంతగానో ఎంజాయ్ చేశాను. హోస్టుగా నాపై విశేషమైన ప్రేమాభిమానాలు చూపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో జరగనున్న ఫినాలే ఎపిసోడ్ తో హోస్టుగా నా ప్రయాణం ముగుస్తోంది. హోస్టుగా మీ అందరికీ నేను మంచి వినోదాన్ని అందించానని భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. సాధ్యమైనంత వరకు ఉన్నతంగా షోను కొనసాగించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు అని పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న  సీజన్‌11 జనవరి 26తో ముగియనుంది.

Also Read: Saif Ali khan: సైఫ్ కేసులో నిందితుడిని పట్టించిన పరోటా.. UPI పేమెంట్‌తో ఎలా దొరికిపోయాడో చూడండి!

Also Read: లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు