Ajanta Ellora International Film Festival: 'శాంతి నికేతన్' చిత్రానికి గోల్డెన్ కైలాస్ అవార్డు!

10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. ఈ అవార్డు వేడుకల్లో 'శాంతినికేతన్' చిత్రం ఉత్తమ భారతీయ చిత్రంగా గోల్డెన్ కైలాస్ అవార్డు సొంతం చేసుకుంది. దీంతోపాటు రూ. లక్ష ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంది.

New Update
Shantiniketan

Shantiniketan

Ajanta Ellora International Film Festival:  10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది.  జనవరి 15 నుంచి 19, 2025 వరకు PVR INOX, ప్రోజోన్ మాల్, ఛత్రపతి శంభాజీనగర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు జాతీయ,  అంతర్జాతీయ కళాకారులు హాజరయ్యారు. మరాఠ్వాడా ఆర్ట్, కల్చర్ అండ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. 5 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఈ అవార్డు వేడుకల్లో వివిధ భాషలో నుంచి ఎంపికైన 9 బెస్ట్ చిత్రాలు స్క్రీనింగ్ చేయబడ్డాయి.

Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

ఉత్తమ చిత్రంగా 'శాంతినికేతన్' 

ఇందులో భాతదేశానికి చెందిన 'శాంతినికేతన్' సినిమా ఉత్తమ భారతీయ చిత్రంగా అత్యంత ప్రసిద్ధి చెందిన  'గోల్డెన్ కైలాస్'  అవార్డు సొంతం చేసుకుంది. దీంతోపాటు రూ. లక్ష నగదు బహుమతి  కూడా గెలుచుకుంది. ఈ కార్యక్రమానికి నటి సీమా బిస్వాస్ (గౌహతి) అధ్యక్షత వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C. K. మురళీధరన్ (ముంబయి), సీనియర్ ఎడిటర్ దీపా భాటియా (ముంబయి), ప్రముఖ దర్శకుడు జో బేబీ (కొచ్చి),  ప్రఖ్యాత స్క్రీన్ రైటర్,  నటుడు గిరీష్ జోషి (ముంబై) తదితరులు జ్యూరీ ప్యానెల్‌ సభ్యులుగా ఉన్నారు.

Also Read:  Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ

అవార్డు విజేతల జాబితా.. 

  • ఉత్తమ భారతీయ చిత్రం: శాంతినికేతన్
    దర్శకుడు:దీపంకర్ ప్రకాష్
    అవార్డు: గోల్డెన్ కైలాస్ అవార్డు, రూ. లక్ష ప్రైజ్ మనీ, సర్టిఫికేట్

ఉత్తమ నటుడు - నీరజ్ సైదావత్

  • అవార్డు: సిల్వర్ కైలాస్ అవార్డు
    ఫిల్మ్ : శాంతినికేతన్
     డైరెక్టర్:దీపంకర్ ప్రకాష్
     ప్రైజ్ మనీ: రూ. 25,000, సిల్వర్ కైలాస్ ట్రోఫీ, సర్టిఫికేట్

ఉత్తమ నటి అవార్డు:  

  • విజేత: భనితా దాస్ (సిల్వర్ కైలాస్ అవార్డు)
    ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్ 2
     డైరెక్టర్: రిమా దాస్

ఉత్తమ స్క్రిప్ట్ అవార్డు

  • విజేత: సుభద్ర మహాజన్
     చిత్రం: రెండవ అవకాశం
    అవార్డు: ₹25,000, సిల్వర్ కైలాస్ ట్రోఫీ,  సర్టిఫికేట్

ప్రత్యేక జ్యూరీ అవార్డు 

  • చిత్రం: విలేజ్ రాక్‌స్టార్స్ 2
     దర్శకుడు: రిమా దాస్

ప్రత్యేక జ్యూరీ అవార్డు (నటి)

  • విజేత: నంద యాదవ్
    చిత్రం: శాంతినికేతన్
    దర్శకుడు :దీపంకర్ ప్రకాష్

ఉత్తమ లఘు చిత్రం 

  • చిత్రం: తోకల
    దర్శకుడు: వైభవ్ నిర్గత్
  • అవార్డుతో కలిపి ₹25,000, సిల్వర్ కైలాస్ ట్రోఫీ, సర్టిఫికేట్

MGM షార్ట్ ఫిల్మ్ పోటీ (ఉత్తమ షార్ట్ ఫిల్మ్)

  • సినిమా: జానీవ్
    దర్శకుడు: స్వప్నిల్ సరోదే
     అవార్డుతో కలిపి: ₹25,000, సిల్వర్ కైలాస్ ట్రోఫీ,

ఫిప్రెస్సీ ఇండియా అవార్డు 

  • చిత్రం: ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ది ట్రీ
    డైరెక్టర్: బాబాక్ ఖాజేపాషా

ఆడియన్స్ ఛాయిస్ అవార్డు (ఉత్తమ చిత్రం)

  • చిత్రం: సవన్నా అండ్ ది మౌంటైన్
    డైరెక్టర్: పాలో కార్నీరో

Also Read:Actor Rangaraju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు రంగరాజు మృతి

Also Read:ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్

Advertisment
తాజా కథనాలు