/rtv/media/media_files/2025/07/21/ed-notice-to-rana-prakash-raj-and-manchu-lakshmi-2025-07-21-17-23-05.jpg)
ed notice to rana prakash raj and manchu Lakshmi
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్‌విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ తెలిపింది.
Illegal betting app case: ED summons Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda; actors to appear from July 23
— Sudhakar Udumula (@sudhakarudumula) July 21, 2025
The Enforcement Directorate has summoned four leading film personalities — Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda, and Manchu Lakshmi — in connection with… pic.twitter.com/A9x1mkJOi4
Also Read : టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇందులో విజయ్,రానాలతో, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్ తో పాటు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులు ఉన్నారు. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టనుంది. సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్, ఇన్‌ఫ్యుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరపనుంది. ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఫుల్ హ్యాపీ.. ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన..
ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఏంటి?
- దగ్గుబాటి రానా: జంగిల్ రమ్మి యాప్
- హీరోయిన్ నిధి అగర్వాల్: జీట్‌విన్ యాప్
- విజయ్‌దేవరకొండ: ఏ23 యాప్
- మంచు లక్ష్మి: యోలో 247 యాప్
ఇదిలా ఉంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌కు రానా దగ్గుబాటి ప్రమోషన్స్‌పై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. ఆయన టీమ్ ఏం చెప్పిందంటే.. ‘‘నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు మాత్రమే రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అదైనా.. గతంలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా.. అది 2017తోనే ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి వాటితో ఒప్పందాలు చేసుకునే ముందు రానా లీగల్ టీం ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుని ప్రొసీడ్ అవుతుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత.. చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉంటేనే రానా ఆ ప్లాట్‌ఫామ్‌ను అంగీకరించాడని స్పష్టం చేసింది.
Also Read : ఏళ్ళు గడిచినా తగ్గని గ్లామర్.. బికినీలో సీనియర్ నటి హాట్ షో!
latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news