AP Free Bus Scheme: ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇక రయ్ రయ్

APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2025 ఆగస్టు 15వ తేదీ, స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని స్పష్టం చేశారు.

New Update
AP Free Bus Scheme

AP Free Bus Scheme

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 21) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

AP Free Bus Scheme

ఈ పథకం అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక భారంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగానే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ అంటే స్వాతంత్య్ర దినోత్సవం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

ఈ మేరకు మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్'((సున్నా ఛార్జీ) ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న మహిళలందరికీ (సాధారణ బస్సుల్లో) ఉచిత ప్రయాణం వర్తించే అవకాశం ఉంది. ఏపీఎస్‌ఆర్టీసీ సాధారణ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే అవకాశం ఉంది. అయితే ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంది. 

ఇందుకోసం ప్రత్యేకమైన స్మార్ట్ కార్డులు లేదా ఏదైనా డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పథకం అమలులో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దుర్వినియోగానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఈ పథకాన్ని వీలైనంత త్వరగా, పకడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పథకం అమలుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి, విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Andhra Pradesh | free-bus | ap free bus to women | ap-free-bus-scheme

Advertisment
Advertisment
తాజా కథనాలు