AS Ravi Kumar Chowdary: బాలయ్య డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత

ప్రముఖ దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. రవికుమార్ యజ్ఞం మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వీరభద్రమ్, సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం పలు సినిమాలు చేశారు.

New Update
A.S. Ravi Kumar Chowdary

A.S. Ravi Kumar Chowdary

AS Ravi Kumar Chowdary:  టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది.  డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి  గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.  రవికుమార్ హఠాత్తుగా మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో  సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఏఎస్ రవికుమార్ నందమూరి బాలకృష్ణ, నితిన్, సాయి ధరమ్ తేజ్, గోపిచంద్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. చివరిగా ఆయన రాజ్ తరుణ్ తో  'తిరగబడరా సామీ' సినిమా చేశారు. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. 

Also Read: Singer Mangli: డ్రగ్స్ తో దొరికిపోయిన సింగర్ మంగ్లీ.. బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!

Also Read :  ఏయ్ వీడియో ఆపు.. పోలీస్ పై రెచ్చిపోయిన మంగ్లీ!

మానసిక ఒత్తిడి.. 

అయితే ఆయన చేసిన చివరి సినిమాలు వరుస పరాజయాలు కావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే మద్యానికి మద్యానికి బానిస అయినట్టు సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం. మరోవైపు ఇండస్ట్రీ స్నేహితులు కూడా దూరమవడం ఆయనపై ప్రభావం చూపిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రవికుమార్ చౌదరి కొద్ది రోజులగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలిసింది. 

Also Read :  స్టార్ హీరో మమ్ముట్టి కుటుంబంలో పెను విషాదం!

'యజ్ఞం' తో ఎంట్రీ

సీనియర్ దర్శకులు సాగర్,  వీవీ వినాయక్, శ్రీను వైట్ల వంటి వారితో కలిసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్న రవి కుమార్ చౌదరీ.. గోపీచంద్ 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిని ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ వెంటనే అగ్ర హీరోలతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. యజ్ఞం తర్వాత నందమూరి బాలయ్యతో  'వీరభద్ర' సినిమా చేశారు. కానీ, ఈ చిత్రం ఊహించిన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన  'ఆటాడిస్తా' (2008) కూడా డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ 2014లో వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన  'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో భారీ  విజయం అందుకున్నారు. 

ఆ తర్వాత  'సౌఖ్యం', 'తిరగబడరసామి' సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలు  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటకట్టుకున్నాయి. ఇలా వరుస పరాపజయాలతో రవికుమార్ మానసిక ఒత్తిడికి లోనయినట్లు సమాచారం. 

Also Read: Ram charan- Trivikram: ఫ్యాన్స్ కి పండగే.. చరణ్- త్రివిక్రమ్ కాంబోలో అదిరిపోయే సినిమా !

 

director AS Ravi Kumar Chowdary | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు