Deepika Padukone : దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!

బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.

New Update
deepika

బాలీవుడ్(bollywood) నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం(central-government) కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.  2015లో తన వ్యక్తిగత డిప్రెషన్ అనుభవాన్ని బహిరంగంగా పంచుకున్న తర్వాత, దీపికా ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ (The Live Love Laugh Foundation - LLL)ను స్థాపించారు. మానసిక ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా అవగాహన పెంచడంలో, అపోహలను తగ్గించడంలో ఆమె కృషి చేసినందుకు గుర్తింపుగా ఈ బాధ్యతను అప్పగించారు.

Also Read :  'ఫంకీ' గాడు వచ్చేశాడు.. జాతిరత్నాలు 2.0!

దీపికా మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తూ... మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం, మానసిక అనారోగ్యం చుట్టూ ఉన్న అపోహలను తగ్గించడం, దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సంరక్షణ పొందడానికి మార్గాలను మెరుగుపరుస్తారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. దీపికా పదుకొణెతో  ఈ భాగస్వామ్యం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడానికి, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై మరింత అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. దీపికా గళం, ప్రభావం సహాయం కోరడానికి చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. ఈ బాధ్యతను స్వీకరించడం పట్ల దీపికా గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో  దేశం బలమైన పురోగతిని సాధించిందని ఆమె పేర్కొన్నారు.

Also Read :  మంచి కాన్సెప్ట్ తో 'అరి'.. అందరూ చూడాల్సిన మూవీ!

ఈ సంస్థ ద్వారా లక్షలాది మంది

తన ఫౌండేషన్ ద్వారా, దీపికా పదుకొణె దేశంలో మానసిక ఆరోగ్యంపై మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. ఆమె ఒకప్పుడు అపోహలు, నిశ్శబ్దంతో కూడిన సమస్యను బహిరంగ చర్చకు తీసుకొచ్చి, సహాయం కోరే వారి సంఖ్య పెరగడానికి దోహదపడింది. ఈ సంస్థ ద్వారా లక్షలాది మంది ప్రజలు అవగాహన పొందారు. 

Advertisment
తాజా కథనాలు