Funky Teaser:   'ఫంకీ' గాడు వచ్చేశాడు.. జాతిరత్నాలు 2.0!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్  'ఫంకీ' మూవీ టీజర్ విడుదలైంది. డైరెక్టర్  అనుదీప్ కేవీ మార్క్ స్టైల్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. 

New Update

Funky Teaser: జాతి రత్నాలు సినిమా తర్వాత డైరెక్టర్ అనుదీప్ కేవీ మరో యాత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. 

టీజర్ ఎలా ఉందంటే

టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాలో విశ్వక్ ఒక మూవీ డైరెక్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కయాదు లోహర్ విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న మూవీ నిర్మాత కూతురిగా కనిపించారు. ఒక దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే ప్రేమ కథ, అనుదీప్ మార్క్ కామెడీ తో ఫుల్ ఫన్ రైడ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో విశ్వక్ కామెడీ, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ నవ్వులు పూయించాయి. అలాగే కయాదు - విశ్వక్ మధ్య సన్నివేశాలు కూడా అలరించాయి. టైటిల్ కి తగ్గట్లే ఫుల్  'ఫంకీ' గా అదిరిపోయింది టీజర్. 

జాతి రత్నాలు తర్వాత అనుదీప్ నుంచి వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నరేష్, మురళీధరన్ గౌడ్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు మేకర్స్. అనిరుద్ మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటూ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దాదాపు రెండు, మూడేళ్ల అనుదీప్ మళ్ళీ ఈ సినిమతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

ఇదిలా ఉంటే విశ్వక్ రీసెంట్ గా లైలా సినిమతో పలకరించాడు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. దీంతో విశ్వక్ ఫంకీ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Horror Movie: ఒక్కరే అస్సలు చూడకండి.. ఓటీటీలో వణికిస్తున్న హారర్ మూవీ!

Advertisment
తాజా కథనాలు