ARI REVIEW:  మంచి కాన్సెప్ట్ తో 'అరి'.. అందరూ చూడాల్సిన మూవీ!

సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అరి: My Name Is Nobody.  జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో విడుదలైంది.

New Update

ARI REVIEW: సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అరి: My Name Is Nobody.  జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో విడుదలైంది. మనిషి అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు (కామం, క్రోధం, లాభం, మొహం, మదం, మాత్సర్యం ) అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పూర్తి రివ్యూ ఏంటో ఇక్కడ చూద్దాం.. 

'అరి'  అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం. ఈ సినిమా మనిషిలో ఉండే ఆరు శత్రువులు అరిషడ్వర్గాల  చుట్టూ కథ  తిరుగుతుంది. ఇందులోని ఆరు పాత్రలు ఈ ఆరు శక్తులకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ ఆరుగురూ 'ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును' అనే ప్రకటనను చూసి, తమ కోరికలను తీర్చుకోవడానికి అక్కడికి వెళ్తారు. అక్కడ ఉండే ఒక వ్యక్తి  (వినోద్ వ‌ర్మ‌) వీళ్ళ కోరికలు నెరవేరడానికి కొన్ని టాస్కులు అప్పగిస్తుంటాడు. వాటిలో ప్రమాదకరమైన టాస్కులు కూడా ఉంటాయి. వీళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో కోరిక! తమ వింత కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆరుగురు ఎలాంటి పనులకైనా సిద్ధపడతారు. ఈ క్రమంలో వారు ఎలాంటి టాస్కులను ఎదుర్కొన్నారు? మనిషి కోరికల కోసం ఎంతవరకు దిగజారతాడు? కోరికలు తీరుస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? చివరకు ఆ ఆరు పాత్రల కథ ఎలా ముగిసింది? అరిషడ్వర్గాలను ఎలా జయించాలి? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

ఆరుగురి కోరికలేంటి

  •  కామం: సన్నీ లియోన్‌తో గడపాలని కోరికతో  అమూల్ (వైవా హర్ష) వెళ్తాడు. 
  • లోభం: కుటుంబ ఆస్తిని కాజేయాలని ఆశతో  గుంజన్ (శుభలేఖ సుధాకర్) వెళ్తాడు. 
  • మోహం: చనిపోయిన భర్తను తిరిగి కోరుకునే లక్ష్మీ (సురభి ప్రభావతి).
  • మదం: డబ్బు, హోదాతో తరతరాలుగా బతకాలని ఆశించే విప్లవ్ నారాయణ్ (సాయి కుమార్).
  • క్రోధం: శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర  క్రోధం అనే గుణాన్ని సూచిస్తుంది. ఒక రహస్య నిధి కావాలనుకునే కోరికతో  ఇన్‌స్పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) వెళ్తాడు. 
  • మాత్సర్యం:  అనసూయ పాత్ర మాత్సర్యం అనే గుణాన్ని సూచిస్తుంది. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న అనసూయ అందరికంటే తానే అందంగా కనిపించాలనే అసూయ, కోరికతో వెళ్తుంది. 

సినిమా ఎలా ఉందంటే.. 

'అరిషడ్వర్గాలు' అనే క్లిష్టమైన తాత్విక అంశాన్ని తీసుకుని సినిమా తీయడం తెలుగు సినిమాకు ఒక కొత్త ప్రయత్నం. సినిమాలోని  నటీనటుల పర్ఫార్మెన్స్  హైలైట్ గా  నిలిచింది. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  ముఖ్యంగా వినోద్ వర్మ, సాయి కుమార్, అనసూయ పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి. వైవా హర్ష కామెడీ  మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. సినిమా ఆరంభం, అలాగే క్లైమాక్స్ లో వచ్చే కృష్ణ తత్వం, ఆధ్యాత్మిక సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

బలం 

ఈ సినిమాకు సంగీతం, సెకండ్ ఆఫ్ ప్రధాన బలంగా నిలిచాయి.  అనూప్ రూబెన్స్ సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం,  శ్రీకృష్ణుడి పాట చాలా బాగున్నాయి.  సెకండ్ ఆఫ్ వచ్చేసరికి  ఆరు పాత్రల్లో కనిపించే  భావోద్వేగ మార్పు,  వారు పరిణతి చెందే క్రమాన్ని  చక్కగా చూపించారు.  మనిషి ఎలా  ఆలోచించాలి, ఎలా జీవించాలి" అనే విషయాలను ప్రేక్షకుల మదిలో  దర్శకుడు బలంగా నాటుతాడు. సినిమా ద్వారా తాను  చెప్పాలనుకున్న సందేశాన్ని  చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ పోర్షన్ అద్భుతంగా ఆవిష్కరించారు.  కామం, క్రోధం, లాభం, మొహం, మదం, మాత్సర్యం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయి, అలాంటి అరిషడ్వర్గాలను జయించడం ఎలా అనే విషయాన్ని  తెలియజేయడమే ఈ సినిమా ప్రయత్నం. 

బలహీనత 

ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా  నెమ్మదిగా సాగడం, ముఖ్యంగా మధ్య భాగంలో కొంచెం గందరగోళంగా అనిపించడం వంటివి ఈ సినిమా బలహీనతలు. 

Advertisment
తాజా కథనాలు