/rtv/media/media_files/2025/01/12/MSRXb604LDvUX7Wps2tv.jpg)
daku maharaj success meet
బాబీ- బాలయ్య కాంబోలో సంక్రాంతి (Sankranti) కానుకగా విడుదలైన 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దుమ్మురేపుతోంది. పవర్ ఫుల్ డైలాగ్స్ , భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో బాలయ్య కుమ్మేశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక థమన్ బీజీఎం పిచ్చెక్కించిందని కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సినిమా రెస్పాన్స్ పై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రం బృందం.
Also Read : తలకు మాత్రమే కాదు.. కడుపులోనూ పనిచేసే కొబ్బరి నూనె
డాకూ మహారాజ్ సక్సెస్ మీట్ అక్కడే
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. బాలయ్య (Balakrishna) అభిమానుల నుంచి సినిమాకు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని రకాల ఆడియన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. పండగ సీజన్ కావడంతో సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది అనే నమ్మకం ఉంది. ఈ వారంలోనే అనంతపురంలో సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల కిందట ఈ ప్రయాణం మొదలు పెట్టాము. చిత్రబృందమంతా కలిసి పనిచేయడంతో ఈ ఫలితం దక్కింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ (Daaku Maharaj) తో మరో విజయం. దీంతో సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండగలా మారిపోయింది అని అన్నారు. అలాగే నిర్మాత నాగవంశీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read : కలెక్టరేట్ రసాభాస ఘటన..కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు!
This Is How We are Celebrating Now ..
— Bobby (@dirbobby) January 12, 2025
thanks To My Dear #DaakuMaharaj #NBK 🦁
Gaaru #BlockbusterDaakuSankranthi pic.twitter.com/OERzu4D7cJ
Also Read : ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!
సితార, ఫార్ట్యూన్ ఫోర్ ఎంటర్ టైన్మెంట్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, చాందినీ చౌదరీ, ఊర్వశీ రౌతేలా, శ్రద్ధ శ్రీనాథ్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?