BRS MLA: కలెక్టరేట్‌ రసాభాస ఘటన..కౌశిక్‌ రెడ్డి పై మూడు కేసులు నమోదు!

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌ తో దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
PADI KOUSHIK REDDY

BRS MLA: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు  అయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌ తో దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు

సమావేశంలో గందరగోళ పరిస్థితులతో పాటు పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్‌ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు అయ్యింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు పై ఇంకో  కేసును ఫైల్‌ చేశారు.

ఈ మేరకు వేర్వేరుగా మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ లో అభివృద్ది కార్యక్రమాల  సన్నద్దతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ ను ఉద్దేశించి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌ చార్జీ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది.

Also Read: Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

అసలేం జరిగిందంటే..

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నంత పని చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు. 

నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?... అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి... సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో తిట్లు అందుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. 

దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని సమీక్ష సమావేశం నుంచి బయటికి తీసుకుని వెళ్లారు.

Also Read: లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు

Also Read: HMPV: తగ్గుముఖం పడుతున్న HMPV వైరస్ కేసులు..!

Advertisment
తాజా కథనాలు