/rtv/media/media_files/2025/04/19/k5YtZ32qzpqiRbTXzEpN.jpg)
yash master dance with chahal ex wife dhanashree verma video viral
భారత క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. మాజీ భార్య, నటి ధన శ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనివార్య కారణాల వల్ల విడిపోయింది. ఇటీవలే విడాకులు తీసుకుని.. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాహల్ ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున అదరగొడుతున్నాడు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
మరోవైపు నటి ధన శ్రీ సైతం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఆమె త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి ధన శ్రీ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఆమె ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ధనశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చింది.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
డ్యాన్స్ వీడియో వైరల్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా పంచుకుంటుంది. సినిమా సెట్స్‌లో ఉన్న ఫొటోలు, నటీ నటులతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ లేపాయి. తాజాగా ధనశ్రీ తన ఇన్‌స్టాలో డాన్స్ కొరియోగ్రాఫర్ యష్‌తో కలిసి స్టెప్పులేసింది. వీరిద్దరూ చాలా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ధనశ్రీ నడుము పట్టుకుని యష్ వేసిన డ్యాన్స్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కామెంట్లు రచ్చ లేపుతున్నాయి. చాహల్ అభిమానులు సైతం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసే ధన శ్రీ తన కాపురం కూల్చుకుందని కామెంట్లు పెడుతున్నారు. అందుకే చాహల్ భరించలేక వదిలేసాడని తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
dhanasri | chahal | Chahal - Dhana shree | latest-telugu-news | telugu-news