Dhanashree: చాహల్తో విడాకులపై ధనశ్రీ క్లారిటీ.. ఎన్నో కష్టాలు పడుతున్నానంటూ!
చాహల్తో విడాకుల వార్తలపై అతడి భార్య ధనశ్రీ స్పందించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై తాను ఎంతగానో వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారన్నారు. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుందని తెలిపారు.