/rtv/media/media_files/2025/09/07/bigg-boss-telugu-9-2025-09-07-14-41-58.jpg)
bigg boss telugu 9
Bigg Boss Telugu 9: నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా లాంఛ్ కాబోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు(Bigg Boss 9 Telugu Contestants) బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. వీరిలో సెలబ్రిటీలు, కామనర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ సారి కొందరు కంటెస్టెంట్లు అదిరిపోయే డ్యాన్స్ ఫెర్మామెన్స్‌లతో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి శ్రష్టి వర్మ, తనూజా గౌడ, ఆషా సైనీ, ఇమ్మాన్యయెల్, సంజానా గాల్రానీ, భరణి, రాము రాథోడ్, రీతూ చౌదరి, అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య, దీపికా, దేబ్జానీ, శివకుమార్, తేజస్విని గౌడ, శ్రీతేజ, సుమన్ శెట్టి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Trump-Jinping: చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం..జిన్ పింగ్ తో భేటీకి రెడీ అవుతున్న ట్రంప్
🔥 Nagarjuna returns with ₹30 CR paycheck as Bigg Boss Telugu 9 premieres today with a battlefield theme + double houses twist! #BiggBossTelugu9#Nagarjuna#TeluguTVpic.twitter.com/miHAzUjFdO
— FilmyCurry (@FilmyCurry) September 7, 2025
ఇది కూడా చూడండి: BIGG BOSS 9 Telugu: బిగ్ బాస్ లోకి దువ్వాడ జంట... చివర్లో బిగ్ ట్విస్ట్!
భారీ రెమ్యూనరేషన్(Remunaration) తీసుకుంటున్న నాగార్జున..
అలాగే కామనర్స్ నుంచి ఐదుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మనీష్, ప్రియా, డీమాన్ పవన్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌కి హోస్ట్‌గా ఎన్టీఆర్, రెండో సీజన్‌కి హీరో నాని నిర్వహించారు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కి నాగార్జున భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్
ఈ సీజన్‌లో నాగార్జున మొత్తం రూ.35 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గత సీజన్‌లో బిగ్ బాస్‌కి నాగార్జున 20 కోట్లు తీసుకోగా, ఇప్పుడు రూ.35 కోట్లు తీసుకుంటున్నారు. మరికొందరు రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు అంటున్నారు. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అందరితో సరదాగా మాట్లాడటం, అలాగే కఠినమైన సమయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తుంటారని ప్రేక్షకులు అంటుంటారు. అందుకే నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇస్తారని టాక్. మరి బిగ్ బాస్ ఈ సీజన్ ఎలా హిట్ అవుతుందో చూడాలి.