/rtv/media/media_files/2025/06/11/Eo7jhxioRkQSq0YqogGj.jpg)
Trump and Jinping
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య చైనా, రష్యా, భారత్ లు ఏకమయ్యాయి. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మింగుడు పడడం లేదు. అందుకే వెంటనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలవాలని తహతహలాడుతున్నారు. త్వరలో ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నవారు. అక్కడే జిన్ పింగ్ ను కూడా కలిసి భేటీ అవుతారని చెబుతున్నారు.
అక్టోబర్ లో దక్షిణ కొరియా పర్యటన..
దక్షిణ కొరియాలో ఆసియా- పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశం అక్టోబరులో జరుగనుంది. దీనికి ట్రంప్ తో పాటు ఆయన యంత్రాంగం కూడా హాజరవనున్నారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ కూడా వస్తారని సమాచారం. అలా ఇద్దరు నేతలూ ఏపీఈసీ సమావేశం తర్వాత ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ మధ్యనే జిన్ పింగ్...ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య మెలానియాలను జెన్ చైనాకు ఆహ్వానించారు. చైనాతో దౌత్య సంబంధాలు చాలా ముఖ్యమంగా మారిన క్రమంలో ట్రంప్ కూడా ఈ ఆహ్వానానికి యెస్ చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం వీరిద్దరి భేటీ మీదా వస్తున్న కథనాలపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. సమావేశాలు జరిగేది అక్టోబర్ లో కాబట్టి..దానికి ఇంకా సమయం ఉన్నందున ప్రకటించలేదని కూడా చెబుతున్నారు. మరోవైపు దక్షిణ కొరియా పర్యటనపై ట్రంప్ ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు కనుక దక్షిణ కొరియా పర్యటకు వస్తే..అక్కడ ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ను కూడా కలిసే అవకాశం ఉంది. అదే కనుక అయితే ఉత్తర కొరియా, అమెరికాల మధ్యనున్న సమస్యలపై ఇరు దేశాధినేతలూ మాట్లాడుకుంటారని చెబుతున్నారు.
రీసెంట్ గా చైనాలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా, రష్యా, భారత్ అధినేతలు భేటీ అయ్యారు. పలు కీలక ఒప్పందాలను కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు వెళ్ళగక్కారు. భారత్, రష్యా రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, వారందరికీ సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: khalistan: ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులకు తమ నుంచే నిధులు..అంగీకరించిన కెనడా