/rtv/media/media_files/2025/09/07/duvada-2025-09-07-12-36-54.jpg)
BIGG BOSS 9 Telugu
BIGG BOSS 9 Telugu: తెలుగులో బిగ్ బాస్ షో(Bigg Boss Show)కు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికే ఎనిమిది సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో షో నేటినుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రోమో(Bigg Boss 9 Promo)తో షోపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఎప్పటిలాగే సీరియల్, సినీ తారలతో పాటు, సామాన్యులను కూడా తీసుకువస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఈ సీజన్‌లో అడుగుపెట్టనున్నారని జోరుగా టాక్ నడించింది. బిగ్‌బాస్ టీమ్ వారిని హౌస్‌లోకి వారిని ఆహ్వానించారని కానీ చివరి నిమిషంలో వీరిద్దరూ షో నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.
Also Read: బిగ్ బాస్ లోకి వెంకటేష్ లవర్.. ఇక రచ్చరచ్చే!
బిగ్ బాస్ ఆఫర్ పై దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మాకు బిగ్‌బాస్ నుంచి కబురు వచ్చింది నిజమే. స్వయంగా బిగ్‌బాస్ టీం వచ్చింది తమను కలిశారని మాధురిని బిగ్ బాస్ లోకి అడిగారని తెలిపారు. కానీ తాను లేకుండా నేను ఒంటరిగా ఉండలేనన్నారు శ్రీనివాస్. ఇంకా మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్‌బాస్‌కి వెళితే.. అంతా డిస్టర్బ్ అవుతుందనిపిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.
సెలబ్రిటీలు: భరణి శంకర్, రితు చౌదరి, రమ్య మోక్ష, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నవ్య స్వామి, నాగ దుర్గ గుత, తేజస్విని గౌడ, జబర్దస్త్ వర్ష, డెబ్జానీ మోడక్, ఆశా సైనీ, సంజన గల్రాని, కొరియోగ్రాఫర్ శ్రస్తి వర్మ, సింగర్ రాము రాథోడ్, సింగర్ శ్రీతేజ, దువ్వాడ మాధురి.
కామనర్ కంటెస్టెంట్స్: నాగ ప్రశాంత్, మర్యాద మనీష్, హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్), దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ (ఆర్మీ పవన్ కళ్యాణ్), దివ్య నిఖిత, ప్రియా శెట్టి. అధికారిక కంటెస్టెంట్స్ జాబితా కోసం లాంచ్ ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి
దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలై, 36552 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి 8387 ఓట్ల తేడాతో, 2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. వైసీపీ తరుపున ఎమ్మెల్సీ 2021లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.