Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా ఈ నెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినీ నిర్మాత ఏఎం. రత్నం, హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ జ్యోతికృష్ణ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఇది కూడా చూడండి:వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
పవన్ కామెంట్స్
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే మొదటి సారి! పొలిటికల్ ఇంట్రాక్షన్స్ చేశాను కానీ.. సినిమా గురించి మాట్లాడడం ఫస్ట్ టైం. ముందుగా ఈ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేసిన డైరెక్టర్ క్రిష్ కి ధన్యవాదాలని తెలిపారు. ఆయన చాలా మంచి కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. కానీ, పలు కారణాల చేత ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారని వెల్లడించారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ కూడా సినిమాను బాగా హ్యాండిల్ చేశారని చెప్పారు. అసలు ఈ సినిమా అవుతుందా లేదా అనే నిరాశ కలిగినప్పుడల్లా కీరవాణి మ్యూజిక్ జీవం పోసిందని కొనియాడారు.
''సినిమా కోసం ఇంత కష్టపడ్డాం..అంత కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగాను, ఎబ్బెట్టుగాను ఉంటుంది. సినిమా గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు! ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మా నిర్మాత ఏఎం రత్నమే. భారతీయ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన! ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు" అని చెప్పారు. అలాగే చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
అనంతరం దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. సినిమాలో 20 నిమిషాల ఫైట్ సీన్ కి పవన్ కొరియోగ్రఫీ చేశారని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారని కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా వృధా చేయలేదని.. టీమ్ అంతా ఎంతో కష్టపడిందని, వారందరికీ కృతజ్ఞలతలని చెప్పాడు. పవన్ ని ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనిపిస్తారని జ్యోతి కృష్ణ తెలిపారు.
Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు