Horror Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(anupama-parameshvaran) జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి'(Kishkindhapuri OTT) చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. గత నెల 12న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 3 వారాలకు పైగా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగించింది. ఇప్పుడు ఓటీటీలో థ్రిల్ పంచేందుకు వచ్చేసింది. ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. అక్టోబర్ 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుండగా.. అక్టోబర్ 19న జీ తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.
The scare will see you and find your fears!
— ZEE5 Telugu (@ZEE5Telugu) October 10, 2025
Get ready for #KishkindhapuriOnZee5 on #ZEE5Telugu
🎬 World OTT & Television Premiere – Don’t miss it!@BSaiSreenivas@anupamahere@Koushik_psk@sahugarapati7@chaitanmusic@Shine_Screenspic.twitter.com/wTVtxBNHpf
Also Read : ఆ ఒక్క విషయం జక్కన్నకు చాలా కష్టమట .. ఇది తెలిస్తే మీరు షాకే!
సినిమా కథేంటి..
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన 'కిష్కిందపురి' ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులోని సస్పెన్స్ ఎలిమెంట్స్, హారర్ సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపించాయి. కిష్కిందపురి గ్రామంలోని సువర్ణమాయ అనే పాడుబడ్డ బంగళాలో జరిగే సన్నివేశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ, వాళ్ళ స్నేహితుడు సుదర్శన్ ఘోష్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ టూర్స్ అనే షో నిర్వహిస్తుంటారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచడమే ఈ షో ఉద్దేశం. ఈ క్రమంలో దెయ్యాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న 11 మందితో కలిసి కిష్కిందపురి గ్రామంలోని సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వెళ్తారు. కానీ, అక్కడ నిజంగానే దెయ్యం ఉన్నట్లుగా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యం నుంచి హీరో అతడి ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు? అసలు ఆ బంగళాలో దెయ్యంగా తిరుగుతున్న ఆ వేదవతి ఎవరు? వేదవతి దెయ్యంగా ఎందుకు మారింది? అనే అంశాలే సినిమా కథ.
ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ లీడ్ రోల్స్ లో నటించగా.. శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, ప్రేమ, సుదర్శన్, డాక్టర్ భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Rajamouli Birthday Special: సాహోరే జక్కన్న.. నీ తర్వాతే ఎవరైనా..! రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!