/rtv/media/media_files/2024/12/21/DGlSMsojjnAXNEwDMI2J.jpg)
rajamouli1
HBD Rajamouli: ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా ఆయనకే సాధ్యం! తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు! హిట్లు తప్పా ప్లాపులు లేని పర్ఫెక్ట్ డైరెక్టర్! అసిస్టెంట్ ఎడిటర్ గా మొదలై అగ్రదర్శకుడిగా పేరు పొందిన వ్యక్తి ఎస్.ఎస్. రాజమౌళి . నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ తారలు, ప్రముఖుల నుంచి ఆయనకు విషెష్ వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా 'జక్కన్న' కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
జక్కన్న పేరు ఎలా..
- అభిమానులు, హీరోలు అందరూ రాజమౌళిని ముద్దుగా 'జక్కన్న' అని పిలుస్తారు. రాజమౌళికి జక్కన్న అనే పేరును పెట్టింది మరెవరో కాదు.. నటుడు రాజీవ్ కనకాల. 'శాంతి నివాసం' అనే సీరియల్ చేస్తున్న సమయంలో డైరెక్షన్ పట్ల రాజమౌళి డెడికేషన్, పర్ఫెక్షన్ చూసి రాజీవ్ ఆయనను జక్కన్న అని పిలవడం మొదలు పెట్టారు.
ఆ విషయంలో పూర్
- రాజమౌళి ఫైనాన్స్ , లెక్కల విషయంలో కాస్త వీక్ అట. ముఖ్యంగా చెక్కులపై ఆయన సంతకం ఒక్కోసారి ఒక్కోలా ఉండటం వలన చాలాసార్లు అవి రిజెక్ట్ అయ్యేవట. అందుకే చెక్ అథారిటీని కూడా ఆయన భార్య రమ చూసుకుంటారట.
గవర్నమెంట్ యాడ్స్
- రాజమౌళి సినిమాల్లోకి రాకముందు కోటగిరి వెంకటేశ్వరావు వద్ద అసిస్టెంట్ ఎడిటర్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటితో కలిసి డైరెక్టర్ రాఘవేందర్రావు ఆధ్వర్యంలో గవర్నమెంట్ యాడ్స్ కి డైరెక్షన్ చేశారు. అలా జక్కన్న చేసిన ఒక యాడ్ కి మంచి పేరు రావడంతో తొలి సారి డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది.
టీవీ సీరియల్
- 'శాంతి నివాసం' అనే టీవీ సీరియల్ తో జక్కన్న దర్శకుడిగా తన ప్రయాణం మొదలైంది. ఈ సీరియల్ లో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/10/hbd-rajamouli-2025-10-10-13-11-28.jpg)
ఫస్ట్ రెమ్యునరేషన్
రాజమౌళి రూ. 5000 తన ఫస్ట్ రెమ్యునరేషన్ గా అందుకున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడిగా కోట్లు సంపాదిస్తున్నారు.
ప్లాప్ లేని డైరెక్టర్
- 2001లో 'స్టూడెంట్ నెం.1' సినిమా మొదలుకొని RRR వరకు ప్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిపించుకున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. 25 ఏళ్ళ సినీ కెరీర్ లో 12 సినిమాలు చేశారు.
ఆగిపోయిన పౌరాణిక చిత్రం
- స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి' మధ్య గ్యాప్‌లో, రాజమౌళి మలయాళ నటుడు మోహన్ లాల్ తో ఒక మొదటి పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారట. కానీ అది వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.
Also Read: Nikita Dutta: ఎద అందాలు చూపిస్తూ నిఖిత స్టన్నింగ్ ఫొటోస్.. ఫ్లాట్ అవుతున్న కుర్రాళ్లు!