/rtv/media/media_files/2025/10/10/rajamouli-birthday-special-2025-10-10-13-52-29.jpg)
Rajamouli Birthday Special
Rajamouli Birthday Special: తెలుగు సినిమాను ప్రపంచ సినీ రంగానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్.ఎస్. రాజమౌళిగారే. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక్క కథ కాదు, ఒక అనుభవం. ఈగ, మగధీర, ఆర్ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్లతో మన తెలుగు సినిమాకు నూతన దిశ చూపిన జక్కన్న, బాహుబలితో దేశం మొత్తం గర్వించేలా చేశారు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
బాహుబలి రీ–రిలీజ్.. (Baahubali Re Release)
బాహుబలి మొదటి భాగం 2015లో, రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు.
జక్కన్న బర్త్‌డే స్పెషల్ వీడియో వైరల్ (Rajamouli Birthday Special Video)
ఇక అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా బాహుబలి టీం ప్రత్యేకంగా ఒక బర్త్‌డే వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో రాజమౌళి ఎంత కష్టపడి బాహుబలిని అంత అద్భుతంగా తెరకెక్కించారో చూపించారు. ముఖ్యంగా బిజ్జల దేవుడు పాత్ర మేకింగ్, యాక్షన్ సీన్‌ల వెనుక ఉన్న కష్టాన్ని స్పష్టంగా చూపించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది, అభిమానులు జక్కన్నపై తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో కురిపిస్తున్నారు.
ఆస్కార్ తెచ్చిన దర్శకుడు
మన దేశం తరఫున ప్రపంచ సినీ వేదికపై ఆస్కార్ తీసుకురావడం రాజమౌళి సాధించిన మరో గొప్ప ఘనత. ఆర్ఆర్‌ఆర్ చిత్రంలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ రావడం ద్వారా భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ పాటకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
వదిన ప్రోత్సాహంతో జక్కన్న ప్రయాణం..
రాజమౌళి కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఒకరు ఆయన వదిన శ్రీవల్లి. ఆమె సంధించిన ఒక ప్రశ్న "లైఫ్‌లో ఏం చేయాలి అనుకుంటున్నావ్?" అన్నది రాజమౌళిని ఆలోచింపజేసింది. ఆ తరువాత తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రోత్సాహంతో ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలై, చిత్రరచయితలతో పని చేస్తూ, చివరికి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు.
Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!
రాజమౌళి గురించి ఆయన మాటల్లోనే...
ఒక అవార్డు వేడుకలో మాట్లాడిన రాజమౌళి - తన తల్లి రాజనేంద్రి తన టాలెంట్‌ను గుర్తించిందని చెప్పారు. అలాగే వదిన శ్రీవల్లి ఎప్పుడూ ప్రోత్సహించిందని చెప్పడం భావోద్వేగానికి గురి చేసింది.
జక్కన్న సినిమాలు మనకు కేవలం వినోదం మాత్రమే ఇవ్వవు… గొప్ప ప్రేరణను కూడా అందిస్తాయి. బాహుబలి సినిమాను మళ్లీ థియేటర్లో చూడాలన్న ఆసక్తి అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాహుబలి రీ-రిలీజ్ ద్వారా మరోసారి రాజమౌళి మేజిక్ చూడబోతున్నాం!