/rtv/media/media_files/2025/01/29/7Zrv3bfI6rfQbCHDT5Fm.jpg)
RGV notice Photograph: (RGV notice)
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి ఒంగోలు పోలీసులు నోటీసులు పంపారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన షూటింగ్ వల్ల హాజరు కాలేనని ఫిబ్రవరి 7న విచారణకు రావడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. కానీ పలు కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి నోటీసులు జారీ చేశారు.
— RTV (@RTVnewsnetwork) January 29, 2025
Read More>>https://t.co/QBgNiueoi0#APPolice #ramgopalvarma #RTV
ఇది కూడా చూడండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
కేసు ఎందుకంటే?
రాం గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలను మార్ఫించి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఆర్జీవీపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నవంబర్ 19, 25 తేదీల్లో ఆర్జీవీకి నోటీసులు పంపించారు. అయినా కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు.
ఇది కూడా చూడండి: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
ఇది కూడా చూడండి: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!