/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
AP NEWS: కడప అన్నమయ్య జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట పట్టణం బైపాస్ రోడ్ పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైకులు- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు
Also Read : ఏపీ ఈఏపీసెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
ఇటీవలే మరో ప్రమాదం
ఇది ఇలా ఉంటే.. ఇటీవలే కడప జిల్లా తాడిపత్రి మండలం రామచంద్రపురంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చదిపిరాళ్ల సచివాలయానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ఈశ్వరయ్య విధులకు హాజరయ్యేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈశ్వరయ్యతో పాటు గాయపడిన మరోవ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!
అయితే రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి ఒత్తిడి కారణంగానే ఈశ్వరయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈశ్వరయ్య ఆరోగ్యం సరిగా లేని సమయంలోనూ సెలవు మంజూరు చేయకుండా మరో సచివాలయానికి ఇన్చార్జ్‌గా నియమించడం, తీవ్ర ఒత్తిడి కలిగించడమే ఆయన మృతికి కారణమని బంధువులు ఆరోపించారు. ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలోనూ శివరామిరెడ్డి అదనపు బాధ్యతలు, ఆఫీస్ పనులు చెబుతుండేవాడని.. చివరికి విధులకు వెళ్తుండగానే ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్
kadapa accident news | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | andhra-pradesh-crime-reports | breaking news in telugu