/rtv/media/media_files/2025/01/11/9lNc4xCGR9Utw4f0GeA0.jpg)
dil raju it raids
టాలీవుడ్ (Tollywood) బడా నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ దాడులు నాలుగో రోజు కంటిన్యూ అవుతన్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. శ్రీ వేంకటశ్వేర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లాయర్లను తెరిపించిన ఐటీ అధికారులు.. దిల్ రాజు సోదరుడు విజయసింహ నివాసంలోనూ సోదాలు చేస్తు్న్నారు. విజయసింహారెడ్డి ప్రస్తుతం ఆటోమొబైల్ ఫీల్డ్‌లో ఉన్నారు. దిల్‌రాజు, విజయసింహ మధ్య లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలస్తున్నారు. దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం నుంచి సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో సోదాలు ముగిశాయి. దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దిల్ రాజు మినహాయించి పలువురి సినీ ప్రముఖులపై ఐటి సోదాలు ముగిశాయి.
దిల్ రాజు నిర్మాతగా
ఇటీవల సంక్రాంతికి రిలీజైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి కూడా డిస్టిబ్యూటర్ గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ దిల్ రాజుకు ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం భారీ వసూళ్లనే సాధించింది. గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చినా.. ఫస్ట్ డే రూ.186 కోట్లు రాబట్టినట్లు చెప్పడంతో పాటు జోరుగా కలెక్షన్లు వచ్చినట్లు పోస్టర్లు వేశారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం అతి తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్లు పోస్టర్లు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు డిస్టిబ్యూటర్ నుంచి ఎదిగారు. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. భద్ర, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గేమ్ ఛేంచర్ వంటి చిత్రాలతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
Also Read : దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..
Updating...