Huge Blast: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది స్పాట్లోనే..

మహారాష్ట్రలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

New Update
Bhandara Blast

Bhandara Blast Photograph: (Bhandara Blast)

Huge Blast: మహారాష్ట్రలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జనవరి 24వ తేదీ శుక్రవారం రోజున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. భండారా జిల్లాలో ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఫ్యాక్టరీలోని ఆర్‌కె బ్రాంచ్ విభాగంలో పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి పైకప్పు కూలి 12 మంది లోపల చిక్కుకున్నారు. ఇందులో ఇద్దరిని  రక్షించగా, పది మంది ఇంకా లోపల చిక్కుకున్నారని జిల్లా అధికారులు తెలిపారు.

Also Read: దాడిపై సైఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.  స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) కూడా రంగంలోకి దిగింది.  పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.  పేలుడు తర్వాత, ఫ్యాక్టరీ నుండి పొగలు చాలా దూరం కనిపించాయి.   దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. 

Also Read: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

 మహీంద్రా కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం

 తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో 30కి పైగా కార్లు ఉన్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. అవన్నీ మంటలకు ఆహుతి అయిపోయాని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

Also Read : నటి శ్రీదేవి మృతి మాదిరిగానే మరొకటి.. బాత్‌టబ్‌లో మృతదేహం!

Also Read : భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు